ఫ్యాక్ట్ చెక్: రిపబ్లిక్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోల్స్ కు సంబంధించి ఎలాంటి సర్వే నిర్వహించలేదు
ఏప్రిల్/మే 2024లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. టీడీపీ కూటమి గెలుస్తుందా.. లేదా వైసీపీ గెలుస్తుందా అనే సస్పెన్స్ కాస్తా నడుస్తూ ఉంది.
ఏప్రిల్/మే 2024లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. టీడీపీ కూటమి గెలుస్తుందా.. లేదా వైసీపీ గెలుస్తుందా అనే సస్పెన్స్ కాస్తా నడుస్తూ ఉంది. ఏ పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయో అంచనా వేయడానికి కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు సర్వేలు నిర్వహిస్తున్నాయి.
ELECSENSE సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌సీపీకి 122 ఎమ్మెల్యే సీట్లు, టీడీపీ, జేఎస్ కూటమికి 53 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ 17, వైఎస్సార్‌సీపీ మిగిలిన 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
08-02-2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు ముందస్తు ఎన్నికల సర్వేకు సంబంధించిన వాదనతో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వే అని చెప్పుకునే మరో గ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీడీపీ-జనసేన కూటమికి 132 సీట్లు, వైఎస్సార్‌సీ పార్టీకి 41 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని చెబుతూ.. సోషల్ మీడియా యూజర్లు సర్వే ఫలితాలను షేర్ చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీకి 132 సీట్లు, టీడీపీ-జేఎస్ కూటమికి 41, ఇతరులకు 2 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలను ఇతరులు పంచుకున్నారు.
కొంతమంది వినియోగదారులు RTV లోగోతో గ్రాఫిక్ ప్లేట్ ని షేర్ చేసారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రిపబ్లిక్ టీవీ నెట్‌వర్క్ అటువంటి సర్వే ఏదీ ప్రచురించలేదు.
నిశితంగా గమనించగా.. గ్రాఫిక్స్‌లో ఒకే తరహా సంఖ్యలు ఉన్నాయని మేము గుర్తించాం. కొంతమంది వినియోగదారులు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతూ ఉండగా.. ఇంకొంత మంది వినియోగదారులు TDP-JS కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని గ్రాఫిక్స్‌ను పంచుకున్నారు.
తెలుగు భాషలోని గ్రాఫిక్ www.republicworld.com అని ఉంది.. అయితే RTV న్యూస్ నెట్‌వర్క్ లోగోను మనం చూడవచ్చు.
మేము రిపబ్లిక్ వరల్డ్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేశాం.. అయితే ఆ సంస్థ చేసిన ఏ సర్వేను కూడా కనుగొనలేకపోయాము.
తదుపరి శోధనలో.. రిపబ్లిక్ టీవీ నెట్‌వర్క్ అటువంటి సర్వేను నిర్వహించలేదని చెబుతూ షేర్ చేసిన వైరల్ పోస్ట్‌లలో ఒకదానిని X వినియోగదారు షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
రిపబ్లిక్ వెబ్‌సైట్‌లో కూడా ఎటువంటి సమాచారం సర్వే కు సంబంధించి లేదు.. అలాగే రిపబ్లిక్ టీవీ కూడా తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా సర్వే చేయలేదని చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. “రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ మార్ఫింగ్ లోగోను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే నిర్వహించలేదు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అందుకే, రిపబ్లిక్ టీవీ సర్వే పేరుతో చెలామణిలో ఉన్న గ్రాఫిక్స్ అన్నీ బూటకమైనవే. రిపబ్లిక్ టీవీ అలాంటి సర్వే నిర్వహించలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Republic TV published pre-election survey for Andhra Pradesh state assembly polls
Claimed By : Social media users
Fact Check : False