ఫ్యాక్ట్ చెక్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా రోజా ఓడిపోయినప్పుడు మీడియా ముందు ఏడవలేదు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి చేతిలో ఘోర పరాజయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, వారి మద్దతుదారులు అంగీకరించారు. వైసీపీ 2019లో 151 సీట్లను గెలవగా.. 2024 ఎన్నికల్లో 11కి పడిపోయింది. పలువురు మాజీ మంత్రులు కనీసం ఎమ్మెల్యేలుగా గెలవవడంలో ఘోరంగా విఫలమయ్యారు.

Update: 2024-06-12 08:45 GMT

Roja crying

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి చేతిలో ఘోర పరాజయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, వారి మద్దతుదారులు అంగీకరించారు. వైసీపీ 2019లో 151 సీట్లను గెలవగా.. 2024 ఎన్నికల్లో 11కి పడిపోయింది. పలువురు మాజీ మంత్రులు కనీసం ఎమ్మెల్యేలుగా గెలవవడంలో ఘోరంగా విఫలమయ్యారు.

వైఎస్సార్‌సీపీ నుంచి ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన ఎమ్మెల్యేల్లో ఒకరు నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి. చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై ఆమె పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆమె మూడోసారి విజయాన్ని సాధిస్తుందని భావించింది.. కానీ ఆమె ప్రత్యర్థి టీడీపీకి చెందిన గాలి భాను ప్రకాష్‌ చేతిలో దారుణమైన తేడాతో ఓడిపోయారు.
ఆమె ఓటమి చెందిందనే వార్తలు వచ్చాక.. మీడియా ముందు ఆమె ఏడ్చే వీడియో వైరల్ అయ్యింది. ఎన్నికల్లో తనకు ఎవరూ డబ్బు సాయం చేయలేదని అందులో చెప్పడం మనం వినొచ్చు. “ ఓడిపోయాక రోజా రియాక్షన్ చూడండి” అంటూ వీడియో పోస్టు చేశారు. RK Roja Defeat In Nagari Constituency #RojaSelvamani #roja #YSRCongressParty #ysrcp #jaganmohanreddy #tdp #TDPJSPBJPWinning… | Instagram

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను ఉపయోగించి సెర్చ్ చేయగా.. వివిధ YouTube ఛానెల్‌లు ప్రచురించిన వీడియోకు సంబంధించిన పొడవైన సంస్కరణలను మేము కనుగొన్నాము.
TV9 YouTube ఛానెల్ ఫిబ్రవరి 11, 2017న ‘MLA Roja breaks down, slams Chandrababu -TV9’ శీర్షికతో ఒక వీడియోను ప్రచురించింది. వైరల్ విజువల్స్ ను 1.03 నిమిషాల నుండి 1.13 నిమిషాల వరకు చూడవచ్చు. 2017 ఫిబ్రవరిలో టీడీపీ హయాంలో ఎయిర్‌పోర్టులో నిర్భందించినప్పుడు ఆమె ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఓ సదస్సులో పాల్గొనేందుకు అమరావతి వెళ్లిన ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
Full View

ఈ వీడియోను జూలై 2017లో వార్తావాహిని అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రచురించింది.

Full View
సమయం మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. అమరావతిలో నిర్వహించిన మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడగడం తప్పా అని ఆమె ప్రశ్నించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. రోజా ప్రెస్ ముందు ఏడుస్తున్నట్లు చూపించే పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా మీడియా ముందు ఏడ్చిన వీడియో వైరల్ అవుతుంది.
Claimed By :  Youtube Users
Fact Check :  False
Tags:    

Similar News