ఫ్యాక్ట్ చెక్: టీవీ9ని స్వాధీనం చేసుకున్న సాక్షి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

TV 9 తెలుగులోని ప్రముఖ మీడియాహౌస్‌లో ఒకటి. ఇతర భాషల్లో కూడా టీవీ9 నెట్‌వర్క్‌ను విస్తరించారు. తెలుగు వార్తా ఛానెల్ అయిన సాక్షి టీవీ యాజమాన్యం టీవీ9ని టేకోవర్ చేస్తోందని, దాని మేనేజింగ్ డైరెక్టర్ గా నేమాని భాస్కర్ నియమించారనే వాదనతో గత కొన్ని రోజులుగా తెలుగులో ఒక సందేశం ప్రచారంలో ఉంది.

Update: 2024-05-27 11:03 GMT

TV 9 తెలుగులోని ప్రముఖ మీడియాహౌస్‌లో ఒకటి. ఇతర భాషల్లో కూడా టీవీ9 నెట్‌వర్క్‌ను విస్తరించారు. తెలుగు వార్తా ఛానెల్ అయిన సాక్షి టీవీ యాజమాన్యం టీవీ9ని టేకోవర్ చేస్తోందని, దాని మేనేజింగ్ డైరెక్టర్ గా నేమాని భాస్కర్ నియమించారనే వాదనతో గత కొన్ని రోజులుగా తెలుగులో ఒక సందేశం ప్రచారంలో ఉంది.

“టీవీ9ని స్వాధీనం చేసుకున్న సాక్షి –
ర‌జ‌నీకాంత్ ప్లేస్‌లో నేమాని భాస్క‌ర్ –
జ‌గ‌న్ పాపాలు భ‌రించ‌లేమంటూ చేతులెత్తేసిన మైహోం రామేశ్వ‌ర‌రావు –
సాక్షి ఎడిట‌ర్ నేమాని భాస్క‌ర్ కి టివి9 బాధ్య‌త‌లు –
ఇక నుంచి సాక్షి గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేయ‌నున్న టీవీ9 ఇన్నాళ్లూ టివి9కి వేసిన ముసుగు తొల‌గిపోయింది. రాజ‌కీయ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టుగానే అది సాక్షి-2 అని తేలిపోయింది. సోమవారం మ‌ధ్యాహ్నం టివి9 నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ని సాక్షి గ్రూప్ తీసుకుంది. సాక్షి మేనేజింగ్ ఎడిట‌ర్‌గా ఉంటూ ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు ప‌ద‌వి పొందిన నేమాని భాస్క‌ర్ ఇక నుంచి టివి9 బాధ్య‌త‌లు చూస్తార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇన్నాళ్లూ ర‌జ‌నీకాంత్ టివి9 మేనేజింగ్ ఎడిట‌ర్ గా ఉన్నా, ఆప‌రేష‌న్స్ అన్నీ సాక్షి వాళ్లే తెర‌వెనుక నుంచి చూసేవారు. ఇక నుంచి డైరెక్టుగా సాక్షియే టివి9 బాధ్య‌త‌లు చూసుకుంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. జ‌గ‌న్ కోసం టీవీ9 అథఃపాతాళానికి దిగ‌జారిపోయి, క్రెడిబులిటీని దెబ్బ‌తీసుకుంది. టివి9 కేంద్రంగా జ‌గ‌న్ గ్యాంగ్ సాగిస్తున్న అస‌త్య‌ప్ర‌చారాల‌న్నీ మైహోం రామేశ్వ‌ర‌రావుకు చుట్టుకుంటున్నాయి. జ‌గ‌న్ కోసం ఆయ‌న‌ బినామీ మెగా కృష్ణారెడ్డి టీవీ9 కొనుగోలు చేశాడు.
తెలంగాణ‌లో ర‌విప్ర‌కాశ్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మైం హోం రామేశ్వ‌ర‌రావుని యాజ‌మాన్యం కుర్చీలో ఉంచారు. రామేశ్వ‌ర‌రావు జీయ‌ర్ స్వామిని అడ్డంపెట్టుకుని రియ‌ల్ దందాలు న‌డిపించుకుంటూ హాయిగా ఉండేవాడు. జ‌గ‌న్ కోసం టీవీ9 చేసే అకృత్యాల‌న్నీ మైహోం రామేశ్వ‌ర‌రావుకి చుట్టుకుంటున్నాయి. ఈ పాపాలు తాను మోయ‌లేన‌ని మైం హోం వాళ్లు చెప్పేశారు. ఎన్నిక‌లు అయిపోయాయి. ఇక ముసుగులు ప‌ని కూడా లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన జ‌గ‌న్ అండ్ కో టీవీ9ని కూడా సాక్షి యాజ‌మాన్యంలోకి తీసుకుంది. ముందుగా నేమాని భాస్క‌ర్ ని సంస్థ‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ర‌విప్ర‌కాశ్ ద‌గ్గ‌ర ఉండి, ఆయ‌న‌కే దెబ్బ‌కొట్టిన ర‌జ‌నీకాంత్...రేపు త‌మ‌కూ దెబ్బ కొట్ట‌డ‌న్న గ్యారెంటీ ఏంట‌ని.. ర‌జ‌నీకాంత్ ని త‌ప్పించేందుకు నేమాని భాస్క‌ర్ రూపంలో పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టింది. టీవీ9 హ్యాండోవ‌ర్ చేసుకున్నాక‌..త‌మ బినామీల‌తో కొనిపించిన ఎన్టీవీ, 10టీవీలు కూడా సాక్షిలో మిర్జ్ చేస్తార‌ని మీడియా స‌ర్కిళ్ల‌లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కారుతో యుద్ధం చేయాల‌ని, ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే త‌న‌కు చుక్క‌లు చూపిస్తార‌ని...ఈ దాడులు త‌ట్టుకోవాలంటే...అతి పెద్ద మీడియా సామ్రాజ్యం త‌న‌కు అవ‌స‌రం అని భావిస్తున్నార‌ట జ‌గ‌న్ రెడ్డి. ఈ దిశ‌గానే సాక్షి నెట్ వ‌ర్క్ కింద‌కే త‌మ తోక‌చాన‌ళ్లు టీవీ9, 10టీవీ, ఎన్టీవీని తీసుకొస్తున్నారని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.” అంటూ ఓ సుదీర్ఘ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. టీవీ9 యాజమాన్యం ఈ వైరల్ వాదనలను తోసిపుచ్చింది.
సాక్షి మీడియా గ్రూప్ ద్వారా టీవీ9 కొనుగోలుపై వచ్చిన రిపోర్టుల కోసం వెతికినా మాకు అలాంటి నివేదికలేవీ కనిపించలేదు. రెండు మీడియా సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా గ్రూపులుగా ఉన్నందున, ఈ డీల్ జరిగి ఉండి ఉంటే అది ఖచ్చితంగా పెద్ద వార్త అయి ఉండేది. ఈ విషయాన్ని దాదాపుగా అన్ని వార్తా ఛానెల్స్ లేదా వెబ్‌సైట్స్ రిపోర్ట్ చేసి ఉండేవి.. కానీ మాకు అలాంటి నివేదికలు ఏవీ దొరకలేదు.
తదుపరి పరిశోధన తర్వాత, మేము TV9 X (twitter) ఖాతాలో ఈ వైరల్ వాదనలను ఖండిస్తూ ఒక పోస్ట్‌ని కనుగొన్నాము.
సోషల్ మీడియాలో TV9 టేకోవర్ అంటూ వ్యాపించిన పుకార్లు నిరాధారమైనవని, ద్వేషపూరితమైనవి అని పేర్కొంది. భారతదేశపు అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ TV9 నెట్‌వర్క్ ఇటీవలి కాలంలో మంచి అభివృద్ధిని సాధిస్తూ ఉందని కూడా పేర్కొంది. TV9 నెట్‌వర్క్ ఇప్పటికే మీడియా రంగంలో బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. ప్రసార, డిజిటల్ డొమైన్‌లలో అద్భుతమైన పనితీరు సాధించింది. టీవీ 9 గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.
సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా, అనేక వెబ్‌సైట్‌లు TV9 టేకోవర్ క్లెయిమ్‌లను కొట్టివేస్తూ నివేదికలను ప్రచురించాయి.
టీవీ9 స్పష్టీకరణతో ఊహాగానాలకు, పుకార్లకు తెరపడింది. ఇక, 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించే జూన్ 4న అందరి దృష్టి ఉంది. ఏపీ ఎన్నికలు, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సాక్షి మీడియా గ్రూప్ టీవీ9ని టేకోవర్ చేస్తోందన్న వాదన అవాస్తవం. టీవీ9 తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వాదనలను ఖండించింది.
Claim :  టీవీ9 తెలుగు టెలివిజన్ ఛానెల్‌ని సాక్షి టీవీ యాజమాన్యం స్వాధీనం చేసుకోగా, దాని మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ స్థానంలో నేమాని భాస్కర్ నియమితులయ్యారు.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News