ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టలేదు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్‌గా మారింది. ‘తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం’ అనే క్యాప్షన్‌తో ప్రభుత్వంలోని ప్రముఖ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.

Update: 2023-08-22 15:01 GMT

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్‌గా మారింది. ‘తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం’ అనే క్యాప్షన్‌తో ప్రభుత్వంలోని ప్రముఖ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.

పోస్టర్‌లోని ఇతర వివరాలు:

కొత్త రేషన్ కార్డుల కోసం ఆగస్టు 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి

అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది

పాత రేషన్ కార్డులో పేరు లేదా చిరునామా తప్పుగా ఉన్నప్పటికీ, మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్త రేషన్ కార్డు కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

కొత్త రేషన్ కార్డుల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తుల కోసం పిలవలేదు.

“new ration card Telangana” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న పోస్టులలో ఎటువంటి నిజం లేదని, బూటకపు సందేశమని నిర్ధారించే కొన్ని పోస్ట్‌లు, కథనాలు మాకు కనిపించాయి.

"తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు" అనే క్యాప్షన్‌తో ఒక ట్విట్టర్ యూజర్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను పంచుకున్నారు.
sakshi.com ప్రకారం, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రతిపాదన ఏదీ తెలంగాణ ప్రభుత్వం వద్ద లేదు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదని రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేశారు.

V6telugu.com ప్రకారం, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేస్తున్న పోస్టర్లలో నిజం లేదు. ఈ వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి ప్రచారం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

hmtvlive.com ప్రకారం, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన సమాచారంలో ఎటువంటి నిజం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 2023 ఆగస్టు 18న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు.

అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు చేయబోతుందన్న వాదన అవాస్తవం. ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం నుండి అలాంటి ప్రతిపాదన లేదు.
Claim :  Telangana government will be accepting applications for new ration cards from August 21, 2023
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News