ఫ్యాక్ట్ చెక్: TGSRTC కొత్త లోగో అంటూ వైరల్ అవుతోంది నకిలీది.. అసలైన లోగో ఇంకా ఖరారు కాలేదు
ప్రభుత్వ యాజమాన్యంలోని రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. ఇకపై TGSRTC గా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత.. రోడ్డు రవాణా సంస్థలను APSRTC, TSRTC లుగా పేరు మార్చారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. ఇకపై TGSRTC గా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత.. రోడ్డు రవాణా సంస్థలను APSRTC, TSRTC లుగా పేరు మార్చారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ టీజీఎస్‌ఆర్‌టీసీగా పేరు మార్చారు. అందుకు అనుగుణంగా ఆర్టీసీకి సంబంధించిన స్టేషనరీ, స్టాంపులు, లెటర్‌హెడ్‌లను అప్‌డేట్ చేస్తున్నారు.
అయితే చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు TGSRTC కొత్త లోగో అని పేర్కొంటూ ఓ లోగోను సర్క్యులేట్ చేస్తున్నారు. చెలామణిలో ఉన్న లోగో APSRTC పాత లోగోను పోలి ఉంది. TGSRTC తాజా లోగో నుండి చార్మినార్, కాకతీయ కళాతోరణం చిత్రాలు కూడా తొలగించారని చెబుతున్నారు. కొత్త లోగోపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లోగోను పోస్ట్ చేసి.. ఆ తర్వాత తొలగించాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఈ వాదనలను తోసిపుచ్చారు.
‘TGSRTC New logo’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. మేనేజింగ్ డైరెక్టర్ వివరణను ప్రచురించిన కొన్ని వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
అలాగే సజ్జనార్ ట్విట్టర్ లో అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. ఇంకా కొత్త లోగో రాలేదని.. వైరల్ అవుతున్న లోగోలు ఫేక్ అని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగోను డిజైన్ చేస్తున్నామని.. ఇంకా సిద్ధమవ్వలేదని వివరించారు.
"#TGSRTC There is no truth in the social media hype about the new logo. The company has not officially released the new logo yet. The logo that is being promoted on social media as the new logo of TGSRTC is fake. The company has nothing to do with that logo. The company is designing a new logo. The management of TGSRTC has not yet finalized the new logo." ఇదే విషయాన్ని వివరిస్తూ ట్వీట్ వేశారు.

Siasat.com ప్రకారం, TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్, ప్రస్తుత లోగోలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. "సంస్థ ఎటువంటి కొత్త లోగోను ఖరారు చేయలేదని, సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న లోగో నకిలీదని" ఆయన చెప్పారంటూ కథనాన్ని ప్రసారం చేసింది.
అంతేకాకుండా వెబ్‌సైట్, లెటర్‌హెడ్‌లు, రబ్బర్ స్టాంపులు, కార్యాలయ సంకేతాలు, బస్ డిపోలు, బస్ పాస్‌లు, గుర్తింపు కార్డులు, టిక్కెట్లు, బస్సులతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన మార్పులు కూడా చేస్తున్నారని తెలిపారు. లోగోను అప్డేట్ చేయడానికి కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.
నకిలీ లోగోను రూపొందించడంపై టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కె. దిలీప్, హరీష్‌రెడ్డిలపై ఐపీసీ 469, 504, 505 (1) (బి) (సి), IT చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు హన్స్ ఇండియాలో కథనం ప్రచురితమైంది.
చలామణిలో ఉన్న చిత్రం TGSRTC అధికారికంగా విడుదల చేసిన లోగో కాదు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రూపొందించిన మార్ఫింగ్ చిత్రం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC తో కొత్త లోగోను విడుదల చేసింది. కొత్త లోగో నుండి చార్మినార్, కాకతీయ కళాతోరణం చిత్రాలు తొలగించారు.
Claimed By : Social media users
Fact Check : False