ఫ్యాక్ట్ చెక్: జాగ్రత్త, ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లు ఇవ్వడం లేదు..!

విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందజేస్తోందని చెబుతూ.. రిజిస్టర్ చేసుకోడానికి ఓ లింక్‌ను ఇచ్చినట్లు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజీ వైరల్‌గా మారింది. ఇది పూర్తిగా అబద్ధం, అటువంటి అధికారిక ప్రభుత్వ ప్రకటన రాలేదు.

Update: 2022-09-07 07:36 GMT

విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందజేస్తోందని చెబుతూ.. రిజిస్టర్ చేసుకోడానికి ఓ లింక్‌ను ఇచ్చినట్లు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజీ వైరల్‌గా మారింది. ఇది పూర్తిగా అబద్ధం, అటువంటి అధికారిక ప్రభుత్వ ప్రకటన రాలేదు.

Claim: URGENT, Government giving FREE laptop to all the students of india. Register your name on Gov-Laptops Site to get FREE laptop now. To check eligibility visit https://bit.ly/3RApR0r


ఫ్యాక్ట్ చెకింగ్:


ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. ఈ మెసేజ్ వాట్సాప్‌లో వేగంగా సర్క్యులేట్ అవుతూ.. వైరల్ అవుతోంది. ఈ లింక్ ను మా బృందం తనిఖీ చేసినప్పుడు, మెసేజీ లోని లింక్ వెబ్‌సైట్‌కి వెళుతుందని, ఖచ్చితంగా ప్రభుత్వ సైట్ కాదని మేము కనుగొన్నాము. విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌ల గురించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాలేదు.

వైరల్ మెసేజీ ప్రకారం.. భారతదేశంలో అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. విద్యార్థులు తమను రిజిస్టర్ చేసుకోవడానికి, వారి అర్హతను తనిఖీ చేయడానికి దానిపై క్లిక్ చేయమని అడుగుతూ 'బిట్లీ' లింక్ ఇవ్వబడింది.

మీరు బిట్లీ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, అది మమ్మల్ని బ్లాగ్‌స్పాట్ సైట్‌కి దారి మళ్లిస్తుంది. ఆ సైట్ ప్రభుత్వ సైట్‌ కాదని మేము గుర్తించాం.

మేము క్రింద పేర్కొన్న వెబ్‌సైట్‌లోకి వచ్చాము.

https://indiaedulaaptops.blogspot.com/

ఇది ప్రభుత్వ వెబ్ సైట్ కాదు. ఏదైనా ప్రభుత్వ సంబంధిత సమాచారం gov.inతో ముగిసే అధికారిక సైట్‌లో పోస్ట్ చేయబడుతుందనే విషయం మీరు గుర్తించాలి. విద్యార్థులను మరింత తప్పుదారి పట్టించేందుకు వెబ్‌సైట్ లో ఇంటరాక్టివ్ ఇమేజ్‌ని కలిగి ఉంది, అది విద్యార్థులను వారి పేరు, అర్హతను నమోదు చేయమని అడుగుతుంది. మీరు వివరాలను నమోదు చేసినప్పుడు ఈ లింక్‌ను వాట్సాప్‌లో మరో ఐదుగురికి షేర్ చేయమని విద్యార్థులను అడుగుతుంది.

ఇలా వాట్సాప్‌లో ఈ సందేశం వైరల్ అవుతోంది.

ఉచిత ల్యాప్‌టాప్ కోసం రిజిస్టర్ చేసుకోగలిగే ప్రభుత్వ సైట్‌కు తీసుకుని వెళ్తామని చెబుతున్నా.. అందులో ఎటువంటి నిజం లేదు. ఈ బ్లాగ్‌స్పాట్ సైట్ ప్రజలను వారి పేరు, వివరాలను తెలుసుకోడానికి ప్రోత్సహిస్తోంది. అలా చేయడానికి ఈ లింక్ ను వాట్సాప్‌లో మరో ఐదుగురికి సందేశాన్ని పంచుకోవాలని కూడా అడుగుతున్నారు.



ప్రామాణికంగా కనిపించడానికి, పలు facebook ఖాతాల నుండి కంప్యూటర్‌లను పొందారని చెప్పడానికి తప్పుదారి పట్టించే వ్యాఖ్యలతో సోషల్ మీడియా పోస్ట్‌లా కనిపించేలా చిత్రం రూపొందించబడింది. మేము సైట్‌లో ఉన్నప్పుడు కామెంట్‌లు, లైక్‌లు, షేర్‌ల సంఖ్య త్వరగా అధిక సంఖ్యలోకి మారుతున్నట్లు చూపబడుతుంది. సైట్ ఎంత జనాదరణ పొందిందో చూపించడానికి ఇది ఉద్దేశించబడింది.
ఏ ప్రభుత్వ సైట్ కూడా ఇలా ల్యాప్ టాప్ లు అందిస్తున్నట్లు చెప్పలేదు. PIB ఫాక్ట్ చెక్ అటువంటి ప్రకటన ఏమీ లేదని.. ఇది తప్పుడు సమాచారం అని ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది.

ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం కావడం ఇదే మొదటిసారి కాదు. ప్రజలకు సంబంధించిన డేటాను సంపాదించడానికి.. ఇతరులకు అమ్ముకోడానికి ఇలాంటి లింక్స్ కూడా ఒక మార్గమే..! కాబట్టి, వీటిని నమ్మకండి.. క్లిక్ కూడా చేయకండి.
Claim :  The government is giving free laptops to all students, along with a link to register
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News