నిజ నిర్ధారణ - పులి పిల్లలు తమ తల్లిని అనుసరిస్తూ నడుస్తున్న వీడియో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో తీసింది కాదు

అమ్రాబాద్‌ టైగర్‌ రెజర్వ్ లో ఒకచోట జాగరూకత తో తమ తల్లిని అనుసరిస్తున్న యువ పులి పిల్లలు, తెలంగాణ లో పులుల పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ధృవీకరిస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నాం

Update: 2022-08-18 14:23 GMT

తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో తీసిన వీడియో అంటూ మూడు పులి పిల్లలు తమ తల్లి వెనుక పొదల వెనుక జాగ్రత్తగా నక్కి వెళ్లే వీడియో ఒకటి షేర్ అవుతోంది. ఈ క్లెయిం ను ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలంగాణ సభ్యుడు, తెలంగాణలోని ఈFశ్ అధికారి మోహన్ పర్గైన్ పంచుకున్నారు.

"అమ్రాబాద్‌ టైగర్‌ రెజర్వ్ లో ఒకచోట జాగరూకత తో తమ తల్లిని అనుసరిస్తున్న యువ పులి పిల్లలు, తెలంగాణ లో పులుల పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ధృవీకరిస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నాం. @IKReddyAllola @KTRTRS @KonathamDileep @WWF_DG @ntca_india @RandeepHooda @deespeak @ParveenKaswan @IFS_Officers వీడియో ఒక టూరిస్ట్ తీసాడు" అంటూ వీడియోను షేర్ చేసారు.

ఆర్కైవ్ లింకు:

https://web.archive.org/web/20220818131605/https://twitter.com/pargaien/status/1560181146729689088

నిజ నిర్ధారణ:

తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వీడియో తీశారనే వాదన అవాస్తవం. ఈ వీడియో పాతది, నీలగిరి కొండల వద్ద గెడ్డం డ్యామ్ దగ్గర తీసింది.

వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించగా, డిసెంబర్ 2021 లో ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు లభించాయి.

ఇండియాటుడే నివేదిక ప్రకారం, ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహూ పంచుకున్న క్లిప్‌లో దట్టమైన పొదలు మధ్య మూడు పిల్లలు తమ తల్లి వెనుక పరుగెడుతున్నట్లు కనబడుతుంది.

స్పష్టంగా, పులి తల్లి తన 3 పిల్లలను జాగ్రత్తగా గమనించుకుంటూ మార్గనిర్దేశం చేస్తూ కాలిబాటలో ముందుకు నడుస్తూ కనిపించింది, ఈ వీడియోను మొదటగా తమిళనాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆమె డిసెంబర్ 1, 2021న ట్విటర్‌లో వీడియోని "టైగర్ కంట్రీ - ఒక తల్లి తన ముగ్గురు పిల్లలకు క్రమశిక్షణతో జాగ్రత్తగా తీసుకువెల్తోంది, ఇది గెడ్డై డ్యామ్, నీలగిరీస్ వద్ద జరిగింది. విడియో స్నేహితుని ద్వారా లభించింది"

ఈ షేర్ తర్వాత, వీడియో వైరల్ అయ్యింది, సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేశారు. పులి పిల్లల క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అయ్యారని పలు కథనాలు వెలువడ్డాయి.

https://indianexpress.com/article/trending/trending-in-india/mother-tiger-turns-back-at-her-three-cubs-in-viral-video-7651198/

https://www.hindustantimes.com/trending/tiger-mom-checks-on-cubs-walking-behind-her-video-melts-hearts-101638426051878-amp.html

కాబట్టి, తెలంగాణాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో తీసిదిగా షేర్ అవుతున్న వీడియో వాస్తవానికి నీలగిరీస్ లో తీసింది, డిసెంబర్ 2021లో ఎంతో ప్రచారంలోకి వచ్చిన వీడియో ఇది. క్లెయిం అవాస్తవం.

Claim :  The video of Tiger cubs following their mother is from Amrabad Tiger Reserve
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News