ఫ్యాక్ట్ చెక్: గుంతలున్న రోడ్డు చూపుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది కాదు.. చైనాకు సంబంధించినది
మైచాంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఎంతో విలువైన పంటలు నాశనమయ్యాయని భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు తుపాను ప్రభావంతో దాదాపు 22 లక్షల ఎకరాల్లో రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు చంద్రబాబు నాయుడు.
మైచాంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఎంతో విలువైన పంటలు నాశనమయ్యాయని భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు తుపాను ప్రభావంతో దాదాపు 22 లక్షల ఎకరాల్లో రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు చంద్రబాబు నాయుడు. తుపాను తర్వాత పరిస్థితిని చర్చించడానికి ప్రతిపక్ష నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తుఫాను బాధితులకు తగిన సహాయం అందించడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన తప్పుబట్టారు.
గుంతలమయమైన రోడ్డు మీద వాహనాలు వెళుతున్నట్లు చూపించే ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిని చూపుతుందనే వాదనతో ప్రచారంలో ఉంది. “హే ప్రభూ హరిరామ్ కృష్ణనాధం జగన్మోహన్ రెడ్డి క్యాహువా #ApRoads #PotatoCm #AndhraPradesh” అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ కు చెందినది కాదు.
మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని.. Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించాం.. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించిన పాత వీడియోలను మేము కనుగొన్నాము.
ట్విట్టర్ లో కూడా ఈ వీడియోను ఇండోనేషియన్ భాషలో పోస్టు చేశారు. “వర్షాకాలంలో గుంతలు నిండిన రోడ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. రోడ్లపై గుంతలు వాహనదారులకు సవాలుగా మారుతున్నాయి. పైగా, వర్షాకాలంలో రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడితే, నీటి కారణంగా కనిపించవు. మనం లోతును చూడలేక ముందుకు వెళితే మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ వీడియోలో రోడ్డు డ్యామేజ్ అయినట్లు డ్రైవర్‌కు తెలియదు. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనది." అని అందులో ఉండి.
“The struggle to drive over20kmph is real #potholes #pothole #mumbai #mumbairoads #maharashtra #roads #rains #TMC #BMC #aamchimumbai #mumbairain”అనే శీర్షికతో జూలై 2020లో Facebookలో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము
అక్టోబర్ 2020లో కార్స్ హిట్టింగ్ మాసివ్ పాథోల్స్ (#5) అనే యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను అప్లోడ్ చేశారు.
రోడ్లపై ఉన్న గుంతలను కార్లు, ఇతర వాహనాలు దాటుతున్నట్లు చూపించే వివిధ వీడియోలను ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఈ ఛానల్ హాంకాంగ్‌లో ఉందని బయో ద్వారా తెలుసుకున్నాం.
"భారీ వర్షం తర్వాత చైనీస్ రోడ్లపై గుంతలు" అనే శీర్షికతో 2020 జూలై 12న YouTube ఛానెల్ సినిమా టీవీలో వీడియో అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము. వీడియోలోని షాప్ బిల్‌బోర్డ్‌లు చైనీస్ భాషలో ఉన్నట్లు మనం చూడవచ్చు.
కాబట్టి, ఈ వీడియో 2020 సంవత్సరానికి చెందినది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Video shows potholes in Andhra Pradesh during the tenure of Chief Minister Jaganmohan Reddy
Claimed By : Twitter users
Fact Check : False