ఫ్యాక్ట్ చెక్: కార్బన్ డయాక్సైడ్ కారణంగా వాతావరణానికి ఇబ్బందులు ఉండవనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

కార్బన్ డయాక్సైడ్ భూమి మీద అతి ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువు. హీట్ ట్రాపింగ్ గ్యాస్ అని కూడా అంటారు. కార్బన్ డయాక్సైడ్

Update: 2024-10-03 05:17 GMT

Carbon Dioxide

కార్బన్ డయాక్సైడ్ భూమి మీద అతి ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువు. హీట్ ట్రాపింగ్ గ్యాస్ అని కూడా అంటారు. కార్బన్ డయాక్సైడ్ రెండు ప్రాథమిక వనరుల నుండి వస్తుంది. ఒకటి సహజంగా ఇంకొకటి మానవ కార్యకలాపాల కారణంగా!! కార్బన్ డయాక్సైడ్ సహజ వనరులలో చాలా జంతువులు ఉన్నాయి, ఇవి కార్బన్ డయాక్సైడ్‌ను వదులుతాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను పెంచుతోంది మాత్రం మానవులే. బొగ్గు, చమురు, న్యాచురల్ గ్యాస్ ను కాల్చడం కారణంగా కూడా వాతావరణం లోకి కార్బన్ డయాక్సైడ్ చేరుతుంది.

మంచి పంట దిగుబడిని అందించడానికి ఆ ప్రాంతంలో ఉండే కార్బన్ డయాక్సైడ్‌ సహాయపడుతుంది. అయితే కార్బన్ డయాక్సైడ్ కారణంగా మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మంచి జరుగుతూ ఉందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. “This is a picture of a CO2 generator used by commercial growers to INCREASE the CO2 in the building and so speed up and increase their crop yields. Plants adore CO2 as well as warmth! We rely on plants for Oxygen, natures a wonderful thing. Please don't share, it makes too much sense”. అంటూ పోస్టులు పెడుతున్నారు. CO2 జనరేటర్ ద్వారా పంటలను పెంచుతూ ఉన్నారని, పంటలకు చాలా మంచి చేస్తాయంటూ ఆ పోస్టుల్లో తెలిపారు. మనం ఆక్సిజన్ కోసం మొక్కలపై ఆధారపడతాము, కానీ అదే మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ మీద ఆధారపడుతున్నాయని అందులో తెలిపారు. ప్రకృతి ఎంత చిత్రమైనదని కదా అంటూ పోస్టులు పెట్టారు.
కార్బన్ డయాక్సైడ్‌తో నిండిన వాతావరణంలో మొక్కలు బాగా పెరిగినప్పుడు, అది పర్యావరణానికి హానికరం కాదని, వాతావరణ మార్పులకు ఎలా కారణమవుతుందని పోస్ట్ ద్వారా వాదిస్తూ ఉన్నారు.
Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కార్బన్ డయాక్సైడ్ కిరణజన్య సంయోగక్రియకు తోడ్పాటును అందించినప్పటికీ, భూ గ్రహం, మొక్కలకు హానికరంగా పరిగణించాల్సి ఉంటుంది.
Clientearth.orgలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, శిలాజ ఇంధనాలను కాల్చినప్పుడు అవి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, గ్రీన్హౌస్ వాయువును గాలిలోకి విడుదల చేస్తాయి. గ్రీన్‌హౌస్ వాయువులు మన వాతావరణంలో వేడిని బంధిస్తాయి, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతాయి. ఇప్పటికే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1C పెరిగింది. 1.5°C కంటే ఎక్కువ వేడెక్కడం వల్ల సముద్ర మట్టం మరింత పెరుగుతుంది. వాతావరణంలో ఊహించని మార్పులు, జీవవైవిధ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, ఎన్నో జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆహార కొరత, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 
గ్లోబల్ వార్మింగ్‌కు శిలాజ ఇంధనాల నుండి వెలువడే ఉద్గారాలే ప్రధాన కారణమని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) కనుగొంది. 2018లో, ప్రపంచ CO2 ఉద్గారాలలో 89% శిలాజ ఇంధనాలు, పరిశ్రమల నుండి వచ్చాయి. బొగ్గు ఒక శిలాజ ఇంధనం, అన్నింటికంటే మురికిగా ఉంటుంది. ఇది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలలో 1Cలో 0.3C కంటే ఎక్కువ పెరుగుదలకు కారణం. ఇది భూ ఉష్ణోగ్రత పెరుగుదలకు అతిపెద్ద మూలం.చమురు మండినప్పుడు భారీ మొత్తంలో కార్బన్‌ను విడుదల చేస్తుంది. ప్రపంచంలోని మొత్తం కార్బన్ ఉద్గారాలలో దాదాపు మూడో వంతు చమురు మండడం కారణంగా ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో సముద్ర పర్యావరణ వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాన్ని చమురు కూడా చూపుతోంది.
వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తన ఆరవ అంచనా నివేదికలో 'పరిశీలించిన అన్ని ఉద్గారాల పరిస్థితులలో కనీసం మధ్య శతాబ్దం వరకు భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. రాబోయే దశాబ్దాల్లో కార్బన్ డయాక్సైడ్ (CO2), ఇతర గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల వాడకం తగ్గించడం జరగకపోతే 21వ శతాబ్దంలో గ్లోబల్ వార్మింగ్ 1.5°C- 2°C మించిపోతుంది.
నాసా ప్రచురించిన నివేదిక ప్రకారం, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ గ్రహాన్ని వేడి చేస్తుంది. ఇది వాతావరణ మార్పులకు కారణమవుతుంది. మానవ కార్యకలాపాలు 200 సంవత్సరాలలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ కంటెంట్‌ను 50% పెంచాయి. నాసా నివేదిక కాలక్రమేణా ప్రపంచ కార్బన్ డయాక్సైడ్‌లో చారిత్రక మార్పుల యానిమేటెడ్ మ్యాప్‌ను కూడా పంచుకుంది.

ఇతర ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఈ క్లెయిం తప్పు అని నిరూపించారు. కార్బన్ డయాక్సైడ్ పర్యావరణానికి హాని కలిగించదు, వాతావరణ మార్పులకు కారణం కాదనే వాదన తప్పు. కార్బన్ డయాక్సైడ్ పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకానీ ఇది పర్యావరణానికి హానికరం కాదనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim :  కార్బన్ డయాక్సైడ్ పంటల పెరుగుదలకు మంచి చేస్తుంది. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. వాతావరణ మార్పులకు కారణం కాదు
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News