ఫ్యాక్ట్ చెక్: 23 సంవత్సరాల మహిళకు 24 మంది పిల్లలున్నరనేది నిజం కాదు

ది లాన్సెట్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1951లో 6.18 ఉండగా..

Update: 2024-09-26 11:33 GMT

mother of 24 children

ది లాన్సెట్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1951లో 6.18 ఉండగా.. 2021లో 1.91కి చేరింది. ఈ లెక్కలు చూస్తే భారతదేశంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది. ఇక 2050 నాటికి 1.3కి, 2100 నాటికి 1.04కి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2050 నాటికి సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరిపోనుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -4 (NFHS-4) డేటాను విడుదల చేసింది. 49 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వివాహిత మహిళల్లో నాలుగింట ఒక వంతు మాత్రమే రెండవ బిడ్డను కోరుకుంటున్నారని డేటాలో తేలింది. ఎక్కువ మంది పిల్లలను కంటే ఎక్కువ ఖర్చు అవుతుందనే అపోహలు కూడా ఉన్నాయి. అధిక వ్యయం, కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం, గర్భం దాల్చిన తర్వాత వచ్చే మార్పులు వంటివి ఎక్కువ మంది పిల్లలను కనాలని అనుకోకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఓ మహిళ 24 మంది పిల్లలకు తల్లినంటూ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి.... యూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు.” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ వాదన X ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌ అవుతూ ఉంది.



తెలుగు న్యూస్ వెబ్‌సైట్ ఆంధ్రజ్యోతి కూడా ఆమెకు 23 ఏళ్లు మాత్రమేనని, అయితే 24 మంది పిల్లలు ఉన్నారని ఒక కథనాన్ని పంచుకుంది. ఆమె 12 సార్లు గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రతిసారీ 2 లేదా 3 పిల్లలకు జన్మనిచ్చిందని కథనం పేర్కొంది. యూపీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసముంటున్న ఖుష్బూ పాఠక్ అనే మహిళకు అంతమంది పిల్లలు ఉన్నారని కథనంలో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ మహిళకు 24 మంది పిల్లలు లేరు. ఆమెకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. కామెడీ వీడియోలోని స్క్రిప్ట్‌లో భాగంగా చిత్రీకరించారు.

మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, భారత్ ప్రైమ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కనుగొన్నాము. ఈ వీడియో ఆగస్ట్ 11, 2024న అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో, ఇది ఒక కామెడీ యాక్ట్ అని, ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు బృందంలో భాగమని మహిళ వెల్లడించింది.

Full View
ఆగస్ట్ 18, 2024న ఖబర్ దునియా అనే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, ఇంటర్వ్యూలో, ఆమె తన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని, మిగిలిన 22 మంది ఫీల్డ్‌లో ఉన్నారని తెలిపింది. అవి ఆమె నాటిన చెట్లు అని తెలిపింది. ఆమె వాటిని తమ స్వంత బిడ్డలుగా చూసుకుంటూ ఉంది. మొక్కలు నాటాలని, వాటిని సొంత బిడ్డల్లా చూసుకోవాలని ప్రజలకు సూచించింది.
Full View
న్యూస్ 24 UP ఉత్తరాఖండ్ కు సంబంధించిన Facebook పేజీలో ఆగష్టు 14, 2024న అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూలో, ఈ జంట తాము YouTube లో కామెడీ వీడియోలను తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చారు.

Full View
Khushboo Pathak యూట్యూబ్ ఛానల్ ను మీరు చూడొచ్చు. పొలాల్లో నాటిన చెట్లను ఆమె తన బిడ్డలుగా వివరిస్తూ ఒక వీడియోను ప్రచురించింది.

Full View

ఈ క్లెయిమ్ ఆగస్ట్ 2024లో వైరల్ అయింది. ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాయి. వైరల్ వీడియోలో కనిపించిన మహిళ 24 మంది పిల్లలకు తల్లి అనే వాదన అబద్ధం. వైరల్ క్లిప్ కామెడీ వీడియోలో భాగం. వాస్తవానికి, ఆమెకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు.
Claim :  ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు 23 ఏళ్ల వయసులో 24 మంది పిల్లలు ఉన్నారు
Claimed By :  Social media users, Mainstream media
Fact Check :  False
Tags:    

Similar News