ఫ్యాక్ట్ చెక్: ఒక ఫోన్ లో రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నందుకు TRAI ఎటువంటి ఛార్జీలను వసూలు చేయదు.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సిమ్ కార్డ్‌ల విక్రయాలు కూడా అనేక రెట్లు పెరిగిపోయాయి. ఈ రోజుల్లో, చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 2 కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లను వినియోగిస్తూ ఉన్నారు.

Update: 2024-06-18 05:50 GMT

TRAI

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సిమ్ కార్డ్‌ల విక్రయాలు కూడా అనేక రెట్లు పెరిగిపోయాయి. ఈ రోజుల్లో, చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 2 కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లను వినియోగిస్తూ ఉన్నారు. కొందరు కాల్స్ కోసం ఒక సిమ్.. డేటా కోసం మరో సిమ్ ను వినియోగిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో నెట్ వర్క్ బాగా వచ్చే సిమ్ లను రెండో సిమ్ కార్డుగా వినియోగిస్తూ ఉంటారు.

ఇక భారతదేశంలో, ప్రజలు ఒకే ఐడీతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుంటూ ఉంది.
ఒక మొబైల్ ఫోన్‌లో 2 సిమ్ కార్డ్‌లు ఉపయోగించాల్సి వస్తే TRAI జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటూ ఓ సందేశం వైరల్ అవుతూ ఉంది. “एक मोबाइल फ़ोन में 2 सिम यूज़ करने पर TRAI लगाएगा जुर्माना! चुनाव तो खत्म हो गया, सरकार भी बन गई, लेकिन चुनाव में खर्च बहुत हुआ है… कहां से पूर्ति होगी खर्चे की?” అంటూ హిందీలో మెసేజీని వైరల్ చేస్తూ ఉన్నారు.
"మొబైల్ ఫోన్‌లో 2 సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తే TRAI జరిమానా విధిస్తుంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల్లో చాలా ఖర్చు చేశారు... ఆ ఖర్చులు ఎక్కడి నుంచి రికవరీ చేయాలి?’’ అని వైరల్ పోస్టుల్లో పేర్కొన్నారు.


నవభారత్ టైమ్స్‌లో ప్రచురించబడిన నివేదికను కూడా మేము కనుగొన్నాము, మీరు రెండు SIM కార్డ్‌లతో మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే.. ఒక సిమ్ ను డీయాక్టివేట్ చేయడం మంచిది. మీరు రెండూ వాడాలంటే మాత్రం సంవత్సరానికి ఒకసారి ఛార్జీని చెల్లించవలసి ఉంటుంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. TRAI అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. TRAI విడుదల చేసిన కన్సల్టేషన్ పత్రాల్లో భాగంగా చేసిన ప్రతిపాదనలను తప్పుగా అర్థం చేసుకున్నారు.
మేము TRAI సోషల్ మీడియా ఖాతాలను వెతికాము. బహుళ సిమ్‌లు/నంబరింగ్ ను కలిగి ఉన్నందుకు వినియోగదారులపై TRAI ఛార్జీలు విధించాలని భావిస్తున్న ఊహాగానాలు నిస్సందేహంగా తప్పు అని పేర్కొంటూ జూన్ 14, 2024న ప్రచురించిన పోస్ట్‌ను మేము కనుగొన్నాము. ఇటువంటి వాదనలు నిరాధారమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఉపయోగిస్తున్నారంటూ ట్రాక్ వివరణ ఇచ్చింది.
మేము Timesnownews.com నివేదికను కూడా కనుగొన్నాము, అటువంటి విధానం ఏదీ ప్రస్తుతానికి పరిగణించడం లేదని తెలిపింది. నివేదిక ప్రకారం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రెండు సిమ్ కార్డులను కలిగి ఉన్నందుకు కస్టమర్ల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టంగా చెప్పింది. TRAI ఇటీవల 'రివిజన్ ఆఫ్ నేషనల్ నంబరింగ్ ప్లాన్'పై ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. ఇది వాటాదారుల నుండి స్పందనలను ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ (TI) వనరుల కేటాయింపు, వినియోగాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలను అంచనా వేసే లక్ష్యంతో వారు కన్సల్టేషన్ పత్రాన్ని జారీ చేస్తారు.
TRAI ఒక ప్రకటనలో “ బహుళ సిమ్‌లు/నంబర్లను కలిగి ఉన్నందుకు వినియోగదారులపై ఛార్జీలు విధించాలని TRAI భావిస్తున్నట్లు ఊహాగానాలు నిస్సందేహంగా తప్పు. ఇటువంటి వాదనలు నిరాధారమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వదంతులను వ్యాపింపజేస్తున్నారు” అని తెలిపింది.
అందువల్ల, ఒక ఫోన్‌లో 2 సిమ్‌లను కలిగి ఉన్నందుకు మొబైల్ వినియోగదారుల నుండి ఛార్జీలు వసూలు చేస్తుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌లను ఉపయోగిస్తున్నందుకు TRAI వినియోగదారులకు ఛార్జీలను వసూలు చేయనుంది.
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News