ఫ్యాక్ట్ చెక్: సెల్ ఫోన్ కారణంగా టీటీకి కరెంట్ షాక్ కొట్టలేదు

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాధితుడు ఖరగ్‌పూర్ రైల్వే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు.

Update: 2023-01-02 10:19 GMT

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాధితుడు ఖరగ్‌పూర్ రైల్వే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీటీఈ సెల్‌ఫోన్‌ వల్ల విద్యుదాఘాతానికి గురై చనిపోయాడని పేర్కొంటూ యూజర్లు వీడియోను షేర్ చేశారు.

'ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న టికెట్ ఇన్స్పెక్టర్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు, అక్కడ ఉన్నపసుపు గీత దాటవద్దు' అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్‌లో వీడియో షేర్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోను నిశితంగా గమనిస్తే ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ను వాడడం లేదని మనం గుర్తించవచ్చు. వీడియోను నిశితంగా పరిశీలిస్తే, ఆ వ్యక్తి తన ఫోన్‌లో మాట్లాడటం లేదా అతని చేతిలో మొబైల్ ఫోన్ కనిపించలేదు. ఆయన కూలిపోడానికి దారితీసే ఒక వైర్ అతనిని తాకడం మనం గమనించవచ్చు. ఆ వ్యక్తి తన ఫోన్ కారణంగా విద్యుదాఘాతానికి గురికాలేదని ఇది స్పష్టం చేస్తుంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. డిసెంబరు 8, 2022 నాటి రైల్వే అధికారి ఆనంద్ రూపనగుడి ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో కనిపించింది. ఆ ట్వీట్ లో "A freak accident— a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries, but out of danger— at Kharagpur station yesterday afternoon!" Here the cause is clearly mentioned as "long piece of loose cable …. touched a TTE's head." అని ఉంది.

ఒక పొడవాటి కేబుల్ ముక్క అతనికి తగిలింది. అతను కాలిన గాయాలతో బాధపడ్డాడు. కానీ ప్రమాదం నుండి బయటపడ్డాడని తేలింది.

అనేక మీడియా సంస్థలు ఈ సంఘటన గురించి నివేదించాయి. వైరల్ అవుతున్న అదే వీడియోను గుర్తించాం. లైవ్ వైర్‌ తాకడంతో టీటీ విద్యుదాఘాతానికి గురయ్యాడని నివేదికలు పేర్కొన్నాయి. ఇండియా టుడేలోని కథనంలో "పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో లైవ్ వైర్‌ కారణంగా విద్యుదాఘాతానికి గురైన రైల్వే అధికారికి కాలిన గాయాలు అయ్యాయి." అని ఉంది.

దీంతో టీటీఈ తలకు కరెంట్ వైర్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడని, అతని ఫోన్ వల్ల కాదని స్పష్టమైంది. అందువలన, ఈ వైరల్ దావా ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  TTE was electrocuted by cell phone at Kharagpur railway station in West Bengal.
Claimed By :  Facebook Users
Fact Check :  Misleading
Tags:    

Similar News