ఫ్యాక్ట్ చెక్: తుషార్ దేశ్ పాండే రోహిత్ శర్మ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉత్కంఠగా సాగుతూ ఉంది. ఏ మ్యాచ్.. ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉత్కంఠగా సాగుతూ ఉంది. ఏ మ్యాచ్.. ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్ పాండే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీయడంపై కొన్ని కామెంట్స్ చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీయడం చాలా సులువు అంటూ తుషార్ దేశ్ పాండే అన్నట్లుగా పోస్టులు వైరల్ చేస్తున్నారు.విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్‌తో పోల్చితే రోహిత్ శర్మ వికెట్ తీయడం 'సులభం' అని దేశ్‌పాండే పేర్కొన్నట్లు అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి. "రోహిత్ శర్మ వికెట్ తీయడం చాలా సులభం, అతను విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటివాడు కాదు" అని ప్రచారం జరుగుతోంది.
NBT నవభారత్ టైమ్స్, మహారాష్ట్ర టైమ్స్‌తో సహా పలు వార్తా సంస్థలు ఈ వైరల్ కోట్‌పై కథనాలను ప్రసారం చేశాయి. NBT నవభారత్ టైమ్స్ హెడ్‌లైన్, "IPL 2023: తుషార్ దేశ్‌పాండే మరింత ఉత్సాహంగా మాట్లాడాడు, రోహిత్‌ని అవుట్ చేయడం చాలా సులభం, అతనేమీ విరాట్ లేదా డివిలియర్స్ కాదు" అని చెప్పినట్లు కథనాలను ప్రసారం చేశారు.
ఈ వివాదంపై ఓ క్లారిటీని ఇవ్వడానికి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో చెప్పాడు. వైరల్ కోట్‌ను 'ఫేక్' అని పేర్కొన్నాడు. తాను అలాంటి ప్రకటనను చేయలేదని తేల్చిచెప్పాడు. రోహిత్ శర్మపై తనకు ఎంతో గౌరవం ఉందని... ముంబై ఇండియన్స్ కెప్టెన్ ను కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడనని అన్నాడు.“రోహిత్ శర్మ లాంటి లెజెండ్ ను కించపరిచే ప్రకటనలు చేయలేదు.. చేయను. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి” అని దేశ్‌పాండే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. ఫ్యాక్ట్ చెకింగ్:
ప్రముఖ క్రికెట్ ఔత్సాహికుడైన ముఫద్దల్ వోహ్రాను అనుకరిస్తున్న @mufaddel_vohra అనే ట్విట్టర్ హ్యాండిల్‌కు సంబంధించిన నకిలీ కోట్‌ను ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. నకిలీ కోట్ ఏప్రిల్ 8, 2023న ట్వీట్ చేశారు. వైరల్ ఖాతా దాని ప్రొఫైల్‌లో ఇది పేరడీ ఖాతా అని పేర్కొంది.
Mufaddal Vohra ట్విట్టర్ లో ఇదొక ఫేక్ కోట్ అని చెప్పాడు. ఇది ఎవరో కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం అంటూ చెప్పుకొచ్చారు.
తుషార్ దేశ్ పాండే రోహిత్ శర్మ వికెట్ ను తీయడం చాలా సులువు అని చెబుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim : Tushar Deshpande ridiculed Rohit Sharma saying his “wicket was easy to take”
Claimed By : News organizations
Fact Check : False