ఫ్యాక్ట్ చెక్: ప్రభాస్ సలార్ సినిమా కోసం కన్నడ ఉగ్రం సినిమాని యూట్యూబ్, ఓటీటీల్లో నుండి తీసేయలేదు

ఉగ్రమ్ అనే కన్నడ చిత్రానికి ప్రభాస్ నటించిన “సలార్” సినిమాకు పోలికలు ఉన్నాయని చెబుతున్నారు.

Update: 2023-10-06 04:59 GMT

ఉగ్రమ్ అనే కన్నడ చిత్రానికి ప్రభాస్ నటించిన “సలార్” సినిమాకు పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. ఉగ్రం, సలార్ చిత్రాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఉగ్రమ్, సలార్ సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను పోల్చారు. యూట్యూబ్ నుంచి ఉగ్రమ్ మూవీని తొలగించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు వస్తున్నాయి. కొంతమంది వినియోగదారులు OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి కన్నడ చిత్రం ఉగ్రమ్ సినిమాని తొలగించారని పలువురు పోస్ట్‌లను కూడా షేర్ చేసారు.

ఒక ట్విట్టర్ యూజర్ “#Ugram removed from #Youtube. #Salaar as an ugramm remake?" అంటూ పోస్టులు పెడుతున్నారు. నివేదికల ప్రకారం, ప్రశాంత్ నీల్ 2014 యాక్షన్ చిత్రం ఉగ్రమ్ యూట్యూబ్ నుండి అకస్మాత్తుగా తొలగించారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది.. ఎందుకంటే సలార్ సినిమా స్క్రిప్ట్ విషయంలో పెద్ద మార్పులు చేయలేదని చెబుతున్నారు. ఉగ్రమ్ సినిమా స్క్రిప్ట్‌కు చిన్న మార్పులతో & ప్రభాస్ ప్రధాన పాత్రలో మళ్లీ చేస్తున్నాడని పుకార్లు ఉన్నాయి. KGF 2 విడుదల సమయంలో నీల్ మీడియాతో మాట్లాడుతూ సలార్ కొత్త కథ అని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, ఇతర విషయాల్లో పోలికలు ఉన్నాయని పుకార్లు వైరల్ అవుతున్నాయి.హోంబాలే ఫిల్మ్స్ అధికారికంగా సలార్ విడుదలను ప్రకటించిన మరుసటి రోజు యూట్యూబ్ నుండి ఉగ్రమ్ ను తీసేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.


Facebook వినియోగదారు రెండు సినిమాలకు సంబంధించి ఫోటోలను ఈ క్యాప్షన్‌తో పంచుకున్నారు: Pic 1: ఇది రెండు సినిమాల మధ్య కొంత సారూప్యత (నివేదికల ప్రకారం) Pic 2:- X(Twitter)లో ట్రెండింగ్ అయిన తర్వాత YouTubeలో ఉగ్రమ్ సినిమాను తీసివేశారు. ఇది నిజంగా రీమేక్ ఉగ్రమ్ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్ రవిబాస్రూర్ కూడా ఉగ్రమ్ బృందంలో ఉన్నారు....

Full View

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. కన్నడ సినిమా ఉగ్రమ్ ఏ మీడియా ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేయలేదు.

సెర్చ్ చేయగా www.businesstoday.in ప్రచురించిన ఒక నివేదికలో, ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా ‘ఉగ్రమ్’కి రీమేక్ కాదని ప్రశాంత్ నీల్ స్పష్టం చేసినట్లు మేము కనుగొన్నాము. తన సినిమాలన్నింటికీ 'ఉగ్రం' షేడ్స్ ఉంటాయని, అది తన స్టైల్ అని చెప్పారు ప్రశాంత్ నీల్.

మేము ““Ugramm movie on OTT” అంటూ సెర్చ్ చేయగా.. VOOT ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉందని మేము కనుగొన్నాము.
justwatch.com
అనే వెబ్‌సైట్ లోనూ, Vootలో ఉగ్రమ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

IMDb లో సెర్చ్ చేయగా.. అక్కడ కూడా Voot లో సినిమా ఉందని తెలిపింది.

జియో సినిమాలో సెర్చ్ చేసినప్పుడు, కన్నడ భాషలో జియో సినిమాలో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని మేము కనుగొన్నాము.

ఉగ్రమ్ సినిమా జీ 5లో హిందీలో కూడా ప్రసారం అవుతోంది. హిందీలో ఈ చిత్రానికి 'మై హూన్ ఫైటర్ బాద్షా' అనే పేరు పెట్టారు.

ఈ చిత్రం SRS మీడియా విజన్ I కన్నడ ఫుల్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అందుబాటులో ఉంది. పూర్తి సినిమా నవంబర్ 2014లో యూట్యూబ్‌లో ప్రచురించారు. “Ugram – ಉಗ್ರಂ|| Kannada Full HD Movie || Sri Murali || Haripriya|| Action Movie ||” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

Full View

కన్నడ చిత్రం ఉగ్రమ్, OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి తీసివేశారని చేస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. ఈ చిత్రం ఇప్పటికీ OTT, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.
Claim :  Salaar movie is a remake of the Kannada movie Ugramm released in 2014. Ugramm Movie (Kannada) has been removed from all OTT platforms.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News