ఫ్యాక్ట్ చెక్: ప్రపంచ కప్ లో ఖాళీ స్టేడియంలు కనిపించడంపై బీసీసీఐ ను సునీల్ గవాస్కర్ విమర్శించారా?

2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ మొదలైంది. భారతదేశం నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ను అక్టోబర్ 5, 2023న అట్టహాసంగా ప్రారంభించారు

Update: 2023-10-12 05:41 GMT

Gavaskar

2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ మొదలైంది. భారతదేశం నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ను అక్టోబర్ 5, 2023న అట్టహాసంగా ప్రారంభించారు. ప్రపంచ క్రికెట్ విజేతగా నిలవడానికి పది జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రపంచకప్ మేనియా మొదలైన నేపథ్యంలో భారత వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొన్ని వ్యాఖ్యలు చేసారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆయన BCCI చేసిన ఏర్పాట్లు సరిగా లేవని.. ఖాళీ స్టేడియంలలో మ్యాచ్ లను నిర్వహిస్తున్నారని.. స్కోర్‌బోర్డ్‌లు కూడా లేని చెత్త ప్రపంచకప్ ఇదే అని చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు

“Sunil Gavaskar on Star Sports: "I am ashamed to call myself Indian. This is the worst Cricket World Cup. Empty stadiums, no scoreboard, pathetic management from BCCI." అని గవాస్కర్ చెప్పినట్లుగా పోస్టులను వైరల్ చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. తనను తాను భారతీయుడిగా చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నానని.. ఇదే చెత్త ప్రపంచ కప్. ఖాళీ స్టేడియంలు.. సరైన స్కోరు బోర్డు లేవు.. చెత్త మేనేజ్మెంట్ చేస్తున్న బీసీసీఐ అని ఆయన అన్నారన్నట్లుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి.


Full View

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. సునీల్ గవాస్కర్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఈ ప్రకటన కల్పితం.

మేము దీనికి సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేసాము. కానీ BCCI గురించి సునీల్ గవాస్కర్ చేసిన అటువంటి ప్రకటన ఏదీ కనుగొనలేకపోయాం. మేము
స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ హ్యాండిల్‌
ని సెర్చ్ చేసినప్పుడు, సునీల్ గవాస్కర్ క్రిటికల్ స్టేట్‌మెంట్ గురించి మాకు ఎలాంటి పోస్ట్ దొరకలేదు.

సునీల్ గవాస్కర్ ఉన్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ సెప్టెంబర్ 28, 2023న ప్రచురించింది.

Full View

సెప్టెంబరు 2023లో ఇదే విధమైన ప్రకటన అతనికి ఆపాదించబడింది.

ఆ ప్రకటనలో “ఈ అందమైన క్రికెట్ గేమ్‌ను రాజకీయం చేయడం, నాశనం చేయడం, ప్రాథమికంగా హైజాక్ చేయడం భారతీయులుగా మనకు అవమానకరమైన విషయం. BCCI భారతదేశాన్ని నిరాశపరిచింది. ఈ రాత్రి ఫలితాలు దానికి నిదర్శనం” అని చెప్పారన్నట్లుగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ కుమారుడు రోహన్ గవాస్కర్ తన X(ట్విట్టర్) హ్యాండిల్‌లో అందుకు సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేశాడు. తన తండ్రి అలాంటి ప్రకటన చేయలేదని వివరణ ఇచ్చారు.

NDTV మీడియా సంస్థ కూడా ఈ ప్రకటన కల్పితమని వివరించారు.
కాబట్టి, సునీల్ గవాస్కర్ ప్రపంచ కప్ ఏర్పాట్లపై బీసీసీఐ ని విమర్శిస్తూ ఎటువంటి క్లిష్టమైన ప్రకటన చేయలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  Sunil Gavaskar made a statement that the BCCI has let India down and he is ashamed of the politicizing
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News