ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో యూ ఎన్ లో మహమ్మద్ రఫీ పాడిన ఏకైక ఆంగ్ల పాట అనడం లో వాస్తవం లేదు
మహమ్మద్ రఫీ ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు, ఆయన ప్రధానంగా హిందీ సినిమాల్లో పాడాడు, అయితే ఆయన ఉర్దూ, తెలుగు, మరాఠీ, భోజ్‌పురి, పంజాబీ మొదలైన భాషల్లో పాటలు కూడా పాడాడు.
మహమ్మద్ రఫీ ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు, ఆయన ప్రధానంగా హిందీ సినిమాల్లో పాడాడు, అయితే ఆయన ఉర్దూ, తెలుగు, మరాఠీ, భోజ్‌పురి, పంజాబీ మొదలైన భాషల్లో పాటలు కూడా పాడాడు. మహ్మద్ రఫీ పాడినన్ని భాషల్లో మరే ఇతర గాయకుడు పాడలేదు.
మహమ్మద్ రఫీ పాడిన ఆంగ్ల పాట వీడియో, ఆయన పాడిన ఏకైక ఆంగ్ల పాట ఇదే అంటూ, 1970వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితిలో ఆయన పాడారనే వాదనతో ప్రచారంలో ఉంది.ఈ వాదన ఫేస్‌బుక్‌లో వైరల్‌గా షేర్ చేయబడింది.
వీడియో లింక్లు ఇక్కడ చూడవచ్చు.
ఈ వాదన జూలై 2023లో X (ట్విట్టర్)లో కూడా వైరల్ అయింది.
నిజ నిర్ధారణ:
వాదన తప్పుదారి పట్టించేది. ప్లేబ్యాక్ సింగర్ ఇంగ్లీషులోనే కాకుండా పెర్షియన్, డచ్, క్రియోల్ వంటి ఇతర భాషలలో కూడా పాటలు పాడారు. ఆయన 2 ఆంగ్ల పాటలు పాడాడు.
మేము యూ ఎన్ లో మహమ్మద్ రఫీ ఇచ్చిన కచేరి కోసం వెతికినప్పుడు, ఆయన అక్కడ పాడినట్టుగా నిర్ధారించడానికి ఎటువంటి లింక్‌లు లభించలేదు. ఐక్యరాజ్యసమితి ఏ సందర్భంలోనూ ఈ గాయకుడికి ఆతిథ్యం ఇచ్చిన దాఖలాలు లేవు.
స్క్రోల్.ఇన్లోని కథనం ప్రకారం, సంగీత స్వరకర్త శంకర్-జైకిషన్ 1968లో చలనచిత్రేతర సంగీత ఆల్బమ్ కోసం ఇంగ్లీష్ నంబర్‌లు పాడమని అతనిని సంప్రదించినప్పుడు, ఆయన ఒప్పుకోలేదనీ, అయితే మావెరిక్ నటుడు-రచయిత హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, గాయకుడికి వీరాభిమాని, సాహిత్యం రాసి ఆయనను ఒప్పించారనీ తెలుగ్స్తోంది. రెండు పాటలు 'బహరోన్ ఫూల్ బర్సావో' (సూరజ్, 1966) అనే హిందీ పాట వంటి స్వరకల్పనపై ఆధారపడిన "" అనే పాట, హమ్ కాలే హైన్ తో క్యా హువా (గుమ్నామ్, 1965) కూర్పు ఆధారంగా "" అనే పాట ఆంగ్లం లో రూపొందించారు.
రఫీ పాడిన ఆంగ్ల పాటల లింకులు ఇక్కడ ఉన్నాయి.
కనుక, ఒకప్పటి ప్లేబ్యాక్ సింగర్ అయిన మహమ్మద్ రఫీ ఇంగ్లీష్‌తో సహా అనేక భాషలలో పాటలు పాడినప్పటికీ, ఐక్యరాజ్యసమితిలో పాటల ప్రదర్శన ఇవ్వలేదు. రఫీ ఇంగ్లీషులో 2 పాటలు పాడారు, అవి సినిమాయేతర ఆల్బమ్‌లలో ఉన్నాయి. దావా తప్పుదారి పట్టిస్తోంది.