ఫ్యాక్ట్ చెక్: ప్రజల మీద నుండి మిలిటరీ వాహనం దూసుకుపోయిన ఘటన పెరులో చోటు చేసుకోలేదు
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి, పెరూలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం 'మచు పిచ్చు'ను ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా పర్యాటకుల కోసం తాత్కాలికంగా మూసివేశారు.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి, పెరూలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం 'మచు పిచ్చు'ను ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా పర్యాటకుల కోసం తాత్కాలికంగా మూసివేశారు.
ముందస్తు ఎన్నికలు జరపాలని, ప్రస్తుత పెరూ అధ్యక్షులు డినా బోలూర్టే రాజీనామా చేయాలంటూ గతేడాది డిసెంబర్ నుండి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని, మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను విడుదల చేయాంటూ ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ నిరసన ప్రదర్శనలను ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. ఈ హింసాకాండలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నిరసనలకు సంబంధించిన వీడియో అంటూ భారీ జనసమూహంపై సైనిక వాహనం వెళుతున్న వీడియో ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
రివర్స్ సెర్చ్ చేయగా 2019 సంవత్సరానికి సంబంధించిన అనేక నివేదికలను కనుగొన్నాం. ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు లేదా పెరూలో ప్రస్తుత నిరసనలతో సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది.CBS న్యూస్ నివేదిక ప్రకారం, 2019లో నికోలస్ మదురో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు, జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జువాన్ గైడో పిలుపునిచ్చిన తర్వాత వెనిజులాలో ఉద్రిక్తతలు పెరిగాయి. వెనిజులా సాయుధ బలగాలను తిరుగుబాటు చేయాలని గైడో పిలుపునిచ్చారు. ఇది రాజధాని, ఇతర ప్రాంతాలలో పౌరులు, సైనికుల మధ్య ఘర్షణలకు దారితీసింది.
వెనిజులా రాజధాని కారకాస్‌లోని లా కార్లోటా సైనిక స్థావరం వెలుపల జువాన్ గిడావో అనుకూల నిరసనకారులపై సైనిక వాహనాలు వెళుతున్నట్లు గ్లోబల్ న్యూస్ నివేదిక చూపుతోంది.
రాయిటర్స్ ప్రకారం, ఏప్రిల్ 30, 2019 న, ఆందోళనల సమయంలో ప్రజలు సైనిక వాహనాలపై రాళ్లను విసిరారు. వాహనాలపై దాడి చేస్తున్న నిరసనకారులపై వెనిజులా నేషనల్ గార్డ్ వాహనం దూసుకెళ్లింది.
ఈ హింసాత్మక ఘటనల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. హింసాకాండను నివారించడానికి సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇరుపక్షాలను కోరింది.
https://news.un.org/en/story/
ఇటీవల పెరూలో ప్రస్తుత పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న సంగతి నిజమే. నిరసనకారులపైకి సైనిక వాహనం వెళుతున్న ఈ వీడియోకు పెరూలో కొనసాగుతున్న ఆందోళనతో సంబంధం లేదు.
Claim : Video of a military vehicle running over protestors is linked to the ongoing Peru protests.
Claimed By : Twitter Users
Fact Check : False