ఫ్యాక్ట్ చెక్: డ్రైవర్ లెస్ బస్సు కాలువలో పడిపోయిందా?
మేఘాలయలో ఓ బస్సు కాలువలోకి పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎరుపు రంగు బస్సు ఏటవాలుగా ఉన్న రోడ్డు మీద నుండి కిందకు పడిపోవడాన్ని మనం గమనించవచ్చు.
మేఘాలయలో ఓ బస్సు కాలువలోకి పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎరుపు రంగు బస్సు ఏటవాలుగా ఉన్న రోడ్డు మీద నుండి కిందకు పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. ప్రజల అరుపుల మధ్య బస్సు కాలువలో పడిపోవడం కనిపించింది. ఈ వీడియోను.. మేఘాలయలో డ్రైవర్ బస్సుకు బ్రేక్ వేయడం మర్చిపోయి కాఫీ తాగడానికి వెళ్లాడు, ఇంజన్ ఆన్ లో ఉండగా బస్సు ఒక్కసారిగా రివర్స్ రావడం మొదలైంది. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో బస్సు ఓ పెద్ద గుంతలో పడిపోయిందని చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వీడియో భారతదేశంలోని మేఘాలయలో చోటు చేసుకుంది కాదు. ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చాలా మందికి గాయాలు అయ్యాయి. ఒక వ్యక్తి చనిపోయాడు.మేము వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లపై Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మే 8, 2023న ప్రచురించిన అనేక వార్తల నివేదికలను మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో కనిపించే బస్సు ఈ వార్తా నివేదికలలో చూడవచ్చు.
Wartabanjar.com ప్రకారం, జకార్తా నుండి యాత్రికులను తీసుకువెళుతున్న టూరిస్ట్ బస్సు సెంట్రల్ జావాలోని టెగల్‌లోని బుమిజావా జిల్లా, గూసి ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఒక వ్యక్తి మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది.
inforadar.disway.com ప్రకారం, బస్సు లో డ్రైవర్ లేడు. వంతెన కింద ఉన్న లోయలోకి బస్సు వెళుతున్న ఘటనను స్థానికులు రికార్డ్ చేశారు. హ్యాండ్‌బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో మేఘాలయకు సంబంధించింది కాదు.. ఇండోనేషియాకు సంబంధించినది.