ఫ్యాక్ట్ చెక్: రిషికేశ్-కేదార్‌నాథ్ మధ్య కొత్తగా నిర్మించిన రహదారి వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్-కేదార్‌నాథ్ మధ్య కొత్తగా నిర్మించిన రహదారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
"కొత్త రోడ్డు మార్గం.రిషికేశ్ నుంచి కేదారినాథ్ వరకి" అంటూ కొందరు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రాలైన రిషికేశ్-కేదార్‌నాథ్ మధ్య కొత్తగా నిర్మించిన రహదారికి సంబంధించిన వీడియో అంటూ చేస్తున్న వాదనలో నిజం లేదు.. తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందు ఉంచారు.
పోస్ట్‌లో భాగస్వామ్యం చేసిన వీడియోను మేము జాగ్రత్తగా పరిశీలించాం. వీడియోలో 0:30 నిమిషాలకు ఓ వ్యక్తి ఖాజాకు వెళ్లే మార్గంలో వారు చూసిన అద్భుత దృశ్యాలను ప్రస్తావించడాన్ని గమనించాము. దానిని క్లూగా తీసుకుంటే, ఈ దృశ్యాలతో పోలిన వీడియోను ప్రచురించిన Instagram పేజీని మేము కనుగొన్నాము. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ హిమాచల్ ప్రదేశ్‌లోని ఖాజా సమీపంలోని స్పితి వ్యాలీకి వెళ్లే మార్గంలో మంచిగా ఉన్న రోడ్లు, అందమైన పర్వతాల వీడియోను షేర్ చేశారు.

వీడియోతో పాటు ఇదే విధమైన దావా ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేయబడింది, ఇక్కడ పోస్ట్ చేసిన వీడియో రిషికేశ్- కేదార్‌నాథ్ మధ్య రహదారి దృశ్యాలు కావని వెల్లడించారు. అవి హిమాచల్ ప్రదేశ్‌లోని ఖాబ్ వంతెనకు సంబంధించినవి వినియోగదారులు పేర్కొన్నారు.
మేము మరింత పరిశీలించి, వీడియోలోని విజువల్స్ కు సంబంధించి.. చాలా యూట్యూబ్ ఛానెల్‌లు ఇలాంటి వీడియోలను ప్రచురించాయని కనుగొన్నాము. అవి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నుండి ఖాజా మార్గంలో కీన్నూర్ జిల్లాలోని ఖాబ్ సంగం వంతెనకు సంబంధించినవని మేము తెలుసుకున్నాము.
https://www.ghumakkar.com/shimla-to-kaza-a-road-review/
https://www.ghumakkar.com/
ఖాజా మార్గంలో ఖాబ్ సంగం వంతెన సమీపంలో నిర్మించిన రహదారి దృశ్యాలు గూగుల్ మ్యాప్స్‌లో కూడా చూడవచ్చు.
మే, 2022లో "మట్టు" అనే యూట్యూబ్ వినియోగదారు పోస్ట్ చేసిన రిషికేశ్ - కేదార్‌నాథ్ మధ్య రోడ్డు నిర్మాణానికి సంబంధించిన చిత్రాలను కూడా మేము కనుగొన్నాము. అనేక ఇతర ప్రదేశాల నుండి కూడా తన రోడ్ ట్రిప్‌లను కూడా పోస్ట్ చేసారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వీడియో హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం వంతెనకు సంబంధించిన దృశ్యాలను చూపుతోంది. వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా రిషికేశ్ - కేదార్‌నాథ్ మధ్య ఉన్న దృశ్యాలు కాదు.
Claim : Scenes of the newly constructed road between Rishikesh and Kedarnath in Uttarakhand.
Claimed By : Social Media Users
Fact Check : False