ఫ్యాక్ట్ చెక్: సాధువులు అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటే ప్రజలు కొట్టరనేది నిజం కాదు

అయోధ్యలో సరయు నది ఒడ్డున అక్టోబర్ 28 నుండి అక్టోబర్ 30, 2024 వరకు భారీ ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు

Update: 2024-10-25 06:37 GMT

sadhus fight 

అయోధ్యలో సరయు నది ఒడ్డున అక్టోబర్ 28 నుండి అక్టోబర్ 30, 2024 వరకు భారీ ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. సరయూ దీపోత్సవ్ ఉత్సవాన్ని ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి రోజున ఘనంగా నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున వేలాది మట్టి దీపాలను వెలిగిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి దేశ విదేశాల నుండి ప్రజలు వస్తారు. దీపాలు వెలిగించే ఈ సంప్రదాయం 2017లో రామ్ కి పైడి అనే ప్రదేశంలో ప్రారంభమైంది. ఏడాదికేడాది సరికొత్త రికార్డులను ఈ కార్యక్రమం ద్వారా సృష్టిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఏడాది లక్ష్మణ్ కిలా ఘాట్ నుండి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులు సరయూ హారతి ఇస్తారని ప్రకటించారు. సరయూ నది ఒడ్డున మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ప్రపంచ రికార్డులు సృష్టించేందుకు పర్యాటక శాఖ కూడా సన్నాహాలు చేస్తోంది. మొదటి రికార్డు 25 లక్షల మట్టి దీపాలను వెలిగించడం, రెండవది 1100 మంది కలిసి సరయూ నది ఘాట్‌లపై అతిపెద్ద హారతి ఇవ్వడం.

ఇంతలో, అయోధ్య వీధుల్లో కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇద్దరు సాధువులు బైక్‌పై ప్రయాణిస్తున్నారని, ఒక అమ్మాయిని వేధించిన తర్వాత కొంతమందితో గొడవ పడ్డారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
“अयोध्या में 2 साधुओं ने लड़की के साथ की छेड़छाड़ तो हुई सरेआम धुनाई, साधुओं ने बाद में छेड़छाड़ का विरोध करने वाले युवक की भी पिटाई की, लड़की के साथ छेड़छाड़ करने के बाद बाइक पर भागे साधू!” అంటూ హిందీలో పోస్టు పెట్టారు. 'అయోధ్యలో ఇద్దరు సాధువులు ఒక అమ్మాయిని వేధించడంతో వారిని బహిరంగంగా కొట్టారు. సాధువులు వేధింపులకు వ్యతిరేకంగా కొందరు అడ్డుపడ్డారు. బాలికను వేధించిన తర్వాత సాధువులు బైక్‌పై పారిపోయారు!' అని ఆ పోస్టుల్లో తెలిపారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
అయోధ్యలో కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తప్పుదారి పట్టించే కథనాలతో ప్రచారం చేస్తున్నారు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేశాం. వైరల్ వాదనకు అక్కడ జరిగిన ఘటనకు చాలా తేడా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఒక సమూహం వ్యక్తులు రీల్స్ చేస్తున్నప్పుడు, మరొక సమూహానికి చెందిన వారు కామెంట్లు చేయడం వల్లే ఈ సంఘటన జరిగిందని పోలీసులు స్పష్టం చేసినట్లు D-ఇంటెంట్ డేటా అనే X ఖాతాలో ఉంది. వేధింపుల గురించిన వాదనలు నిరాధారమైనవని స్పష్టం చేసారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు.

కొంతమంది తప్పుదోవ పట్టించే వాదనలతో వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారని పోస్ట్‌లు పేర్కొన్నాయి. ఆ ప్రాంతానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీడియో బైట్‌ను కూడా మేము కనుగొన్నాం.
అయోధ్య పోలీసుల X ఖాతా, హిందీలో క్యాప్షన్‌తో ఎస్పీ వీడియోను షేర్ చేసింది” थाना कैण्ट क्षेत्रान्तर्गत चौराहे पर मोटर साइकिल सवार द्वारा वीडियों रील बनाते समय दूसरे पक्ष के साथ हुयी कहासुनी व मारपीट की घटना में पुलिस द्वारा की जा रही कार्यवाही के सम्बन्ध में #SPcity की बाइट। कृपया भ्रामक सूचना न फैलायें। #UPPolice #ayodhyapolice” అంటూ పోలీసులు పోస్టు పెట్టారు.
నిని అనువదించినప్పుడు, 'కంటోన్మెంట్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కూడలిలో వీడియో రీల్ చేస్తున్నప్పుడు ఇతర పక్షంతో మోటర్‌సైకిలిస్ట్ వాగ్వాదం జరిగింది. ఈ దాడికి సంబంధించిన ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారని పోలీసుల వీడియో బైట్ ద్వారా తెలుస్తోంది. దయచేసి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని UPపోలీసులు, అయోధ్యపోలీసులు కోరారు.
అయోధ్య పోలీస్ ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ బైక్‌పై ఉన్నప్పుడు రీల్స్ చేయడం చేస్తున్నారు, ఇతర వ్యక్తులు కామెంట్లు చేయడంతో వాగ్వాదం ప్రారంభమైందని తెలిపారు. ఇందులో వేధింపుల కోణం లేదని, అలాంటి సంఘటన ఏమీ లేదన్నారు.
అందువల్ల, అయోధ్యలో బైక్‌పై వచ్చిన సాధువులు అమ్మాయిని వేధించారనే వాదన తప్పుదారి పట్టించేదిగా ఉంది. అలాంటి ఘటనేమీ జరగలేదు.
Claim :  అయోధ్యలో అమ్మాయిని వేధించిన సాధువులు స్థానికులతో గొడవకు దిగిన వీడియో వైరల్‌గా మారింది.
Claimed By :  Twitter user
Fact Check :  Misleading
Tags:    

Similar News