ఫ్యాక్ట్ చెక్: కాలువలో పడిన ఆవును రక్షించిన వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు.. టర్కీది
కాలువలో కొట్టుకుపోతున్న ఆవును బుల్‌డోజర్‌తో రక్షించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన భారతదేశంలో చోటుచేసుకుందనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఆవు కాలువలో కొట్టుకుపోతున్నట్లు వీడియోలో చూపించారు
బుల్డోజర్‌ని ఉపయోగించి ఆవును రక్షించినట్లు చూపుతున్న వీడియో టర్కీకి చెందినది, భారతదేశానికి సంబంధించినది కాదు.
కాలువలో కొట్టుకుపోతున్న ఆవును బుల్‌డోజర్‌తో రక్షించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన భారతదేశంలో చోటుచేసుకుందనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఆవు కాలువలో కొట్టుకుపోతున్నట్లు వీడియోలో చూపించారు.. కాలువ ఒడ్డున ఉన్న బుల్డోజర్ వెంటనే ఆవును రక్షించి సురక్షితంగా పక్కకు తీసుకుని రావడం మనం అందులో చూడవచ్చు.
వైరల్ వీడియో కింద “That is the beauty of India” అనే వాదనతో పోస్టు పెడుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో టర్కీకి సంబంధించినది.. భారత్ కు చెందినది కాదు.
మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించాం. అదే వీడియోని మిడిల్ ఈస్ట్ ఐ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా జూన్ 26, 2023న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
టర్కీలోని ఇగ్దిర్‌లో నీటి ప్రవాహానికి ఆవు కొట్టుకుపోతున్నట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. బుల్డోజర్ ఆపరేటర్ ఆ ఆవును సురక్షితంగా రక్షించడం అందులో చూడవచ్చు.
ఈ వీడియోను జూన్ 27, 2023న TRT వరల్డ్ న్యూస్ ప్రచురించింది. దేశంలోని ఇగ్దిర్ ప్రావిన్స్లో టర్కిష్ డిగ్గర్ ఆపరేటర్ నీటి కాలువలో పడిన ఆవును విజయవంతంగా రక్షించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఆ ఆవు దాదాపు నాలుగు కిలోమీటర్లు కాలువలో కొట్టుకు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.
Full View
Mymodernmet.com లో కూడా ఇందుకు సంబంధించి ప్రస్తావించారు. టర్కీలోని ఇగ్‌డిర్‌లో ఒక ఆవు నీటి కాలువలో కొట్టుకుపోవడం గమనించవచ్చు. ఆ ఆవు తన తలని నీటి పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నా.. బలమైన వరద కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని మనం వీడియోలో గమనించవచ్చు. ఆ సమయంలో కాలువ పక్కనే ఉన్న ఒక ఎక్స్‌కవేటర్ దూడను పట్టుకుని నీటి నుండి పక్కకు లాగడం మనం గమనించవచ్చు. మెషిన్ ఆపరేటర్ ఆ ఆఅవును సున్నితంగా కిందకు దింపాడు. ఆ ఆవు కూడా స్వంతంగా నిలబడగలిగింది.
telegraph.co.uk లో కూడా వీడియోను పబ్లిష్ చేశారు.
బుల్డోజర్‌ని ఉపయోగించి కాలువ నుండి ఆవును రక్షించినట్లు చూపించే వైరల్ వీడియో టర్కీకి చెందినది.. భారతదేశంలో చోటు చేసుకున్నది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Claim : Video shows cow being rescued in India
Claimed By : Social Media Users
Fact Check : False