ఫ్యాక్ట్ చెక్: జిరాఫీ కెమెరాలకు పోజు ఇచ్చిందంటూ వైరల్ అవుతున్న వీడియో యానిమేషన్ ద్వారా సృష్టించినది
A video of a herd of giraffes passing by a CCTV camera, while one of them stops to strike a pose in front of the camera, is viral on social media.
జిరాఫీల గుంపు నడుచుకుంటూ వెళుతూ ఉండడం సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయింది. వాటిలో ఒకటి కెమెరా ముందు పోజు కొట్టడం గమనించవచ్చు. ఆ జిరాఫీ ఆగి ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను పలువురు షేర్ చేసి జిరాఫీ కెమెరాకు పోజులిచ్చిందని చెబుతూ ఉన్నారు.
ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ వీడియో చాలా కాలంగా వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వీడియోలో నిజమైన జిరాఫీలు కనిపించవు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
మేము వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి సెర్చ్ చేయగా.. జూన్ 28, 2013న అప్లోడ్ చేసిన వైరల్ వీడియోను కనుగొన్నాం. ఆ వీడియో నిడివి ఎక్కువగా ఉండడాన్ని కూడా మేము గుర్తించాం. 0.22 సెకన్లలో, వీడియోలోని పేర్లు కనిపించాయి. ఇది నికోలస్ డెవెక్స్ (Nicolas Deveaux) సృష్టి అని అందులో ఉంది.
దాన్ని క్లూగా తీసుకుని.. మేము Nicolas Deveaux అని సెర్చ్ చేశాం. Animatic అనే యూట్యూబ్ ఛానల్ లో “5 meters 80 – Elegance – Animated short film by Nicolas Deveaux – France CGI 3D” అనే టైటిల్ తో ఉన్న వీడియోను గుర్తించాం. స్విమ్మింగ్ పూల్‌లో జిరాఫీల మంద ఈత కొట్టడం వంటివి ఈ వీడియోలో చూడొచ్చు.
Cube Creative అనే విమియో పేజ్ కూడా ఈ వీడియోను అప్లోడ్ చేసింది. జనవరి 31, 2013 లో వీడియోను ‘5 meters 80’ అనే టైటిల్ తో అప్లోడ్ చేశారు. ఆ డిస్క్రిప్షన్ లో షార్ట్ ఫిలిమ్ అని ఉంది. "A herd of giraffes embarks on a series of high-flying acrobatic dives in a deserted Olympic swimming pool." అంటూ వివరణ ఇచ్చారు. ఆర్టే, విల్లే డి పారిస్, CNC మద్దతుతో క్యూబ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ అండ్ ఆరెంజ్ ద్వారా స్టీరియోస్కోపిక్-3Dలో దీన్ని సృష్టించారు.
అందువల్ల, జిరాఫీ కెమెరాకు పోజులివ్వడంలో నిజం లేదు. డైరెక్టర్ నికోలస్ డెవెక్స్ రూపొందించిన యానిమేషన్ వీడియో. వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు.
Claim : video shows a giraffe stopping in front of a camera and posing in front of it, while other giraffes are walking forward.
Claimed By : Social media users
Fact Check : False