ఫ్యాక్ట్ చెక్: బ్రజీల్ లో జరిగిన ఫుట్‌బాల్ అభిమానుల ర్యాలీ వీడియోని ఫ్రాన్స్ లో జరిగినట్టుగా తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇజ్రాయెల్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఐఎస్‌ఐఎల్‌తో పోరాడేందుకు అంతర్జాతీయ సంకీర్ణాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, పాలస్తీనా గ్రూప్ హమాస్‌పై పోరాటాన్ని కూడా విస్తృతం చేయాలని ఆయన సూచించారు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్మాక్రాన్ ఇజ్రాయెల్‌కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఐఎస్‌ఐఎల్‌తో పోరాడేందుకు అంతర్జాతీయ సంకీర్ణాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, పాలస్తీనా గ్రూప్ హమాస్‌పై పోరాటాన్ని కూడా విస్తృతం చేయాలని ఆయన సూచించారు. ఫ్రాన్స్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలను నిషేధించారు, ఫ్రెంచ్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ పబ్లిక్ ఆర్డర్ గురించిన ఆందోళనలను ఉటంకిస్తూ నిషేధాన్ని ప్రకటించారు.
ఇంతలో, ఫ్రాన్స్‌లో జరిగిన భారీ పాలస్తీనా అనుకూల ర్యాలీ అంటూ ఒక వీధిలో భారీ జనసమూహం కవాతు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కొందరు. చుట్టూ ఫ్లాష్‌లైట్‌లతో లక్షలాది మంది వీధుల్లో కవాతు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
వాదన అవాస్తవం. వీడియో ఫ్రాన్స్‌కు చెందినది కాదు, పాలస్తీనియన్ అనుకూల ర్యాలీ కూడా కాదు.
"ఫ్రాన్స్‌లో పాలస్తీనియన్ అనుకూల ర్యాలీ" అనే కీవర్డ్‌లను ఉపయోగించి గూగుల్ లో శోధించినప్పుడు, "నిషేధం ఉన్నప్పటికీ ప్యారిస్‌లో పాలస్తీనియన్ అనుకూల ప్రదర్శన" అన్న టైటిల్ తో AFP వార్తా సంస్థ షేర్ చేసిన వీడియో లభించినది, వివరణలో 'పాలస్తీనియన్లకు మద్దతు, సంఘీభావం తెలుపుతూ ప్రజల ప్రదర్శనలు ఫ్రాన్స్ రాజధానిలో జరుగుతాయి. నిరసనలను అరికట్టేందుకు పోలీసు అధికారులు వారిని మోహరించారు’ అని ఉంది. వీడియోలో వేల సంఖ్యలో పాల్గొన్నట్లు చూడగలం కానీ వైరల్ వీడియోలోలా లక్షలాది మంది కనిపించడంలేదు.
వీడియో నుండి సంగ్రహించిన కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, ఆ వీడియో బ్రెజిల్‌లోని సావో పాలో నుండి వచ్చినదని తెలుస్తోంది. "O caminho da torcida do Palmeiras ao Allianz Parque. @marcelarafael" అనే శీర్షికతో 'Planeta do Futebol' హ్యాండిల్ ద్వారా X (Twitter)లో షేర్ అయిన ఒక పోస్ట్ లభించింది.
అనువదించబడినప్పుడు, ఇది "అలియాంజ్ పార్క్ కు పాల్మీరాస్ అభిమానుల మార్గం @మార్సెలరాఫేల్" అని పేర్కొంది.
'మార్సెలా రాఫెల్' హ్యాండిల్ బయోని తనిఖీ చేసినప్పుడు, ఆమె ESPN ప్రెజెంటర్ అని తెలుస్తోంది. ఒక X వినియోగదారు ఫ్రాన్స్ లో పాలస్తీనియన్ అనుకూల నిరసన అంటూ ఈ వైరల్ వీడియోను షేర్ చేయగా, అది నిజం కాదంటూ, ఆ వీడియో తనదని పేర్కొంటూ మార్సెలా రాఫెల్ పోస్ట్‌కు బదులిచ్చారు. ఇది లిబర్టాడోర్స్‌లో బోకా జూనియర్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు పాల్మెరాస్ అభిమానులను చూపుతోంది.
అక్టోబర్ 5, 2023న Estadao.com.br ప్రచురించిన కథనం వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది.
పల్మీరాస్, బోకా జూనియర్స్ మ్యాచ్ ఫలితాలకు ముందు, బ్రెజిలియన్ జట్టు అభిమానులు అబెల్ ఫెరీరా జట్టుకు తమ మద్దతును చూపించారు. లిబర్టాడోర్స్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడం విలువైనది. అలియాంజ్ పార్క్‌కి ఫుట్‌బాల్ అకాడమీ ప్రతినిధి బృందం వెళ్లే మార్గంలో, వేలాది మంది అభిమానులు బస్సుతో పాటు పాటలు పాడుతూ జట్టును ప్రోత్సహించారు. బస్సు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 గంటకు పైగా పట్టింది. ఇది బహుశా అభిమానులచే అతిపెద్ద ప్రదర్శన అని ఈ వ్యాసం పేర్కొంది.
కాబట్టి, వైరల్ వీడియో బ్రెజిల్‌లోని సావో పాలోలో ఫుట్‌బాల్ అభిమానుల ర్యాలీని చూపుతుంది. ఫ్రాన్స్‌లో పాలస్తీనా అనుకూల ర్యాలీని వీడియో చూపిందన్న వాదన అవాస్తవం.