నిజ నిర్ధారణ: గాలిపటం దారాలకు చిక్కుకున్న అమ్మాయిని చూపించే వీడియో అహ్మదాబాద్ కి చెందినది కాదు, తైవాన్ ది

ఉత్తరాయణం, సంక్రాంతి లేదా పొంగల్ పండుగ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మకర సంక్రాంతి అనేది గాలిపటాల పండుగ, ఇది చలి వెళిపోతూ వసంతకాలం ఆరంభాన్ని సూచిస్తుంది.

Update: 2023-01-21 09:00 GMT

ఉత్తరాయణం, సంక్రాంతి లేదా పొంగల్ పండుగ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మకర సంక్రాంతి అనేది గాలిపటాల పండుగ, ఇది చలి వెళిపోతూ వసంతకాలం ఆరంభాన్ని సూచిస్తుంది. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు, సూర్యకిరణాలు తగలడం వల్ల విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. గుజరాత్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ గాలిపటాల పండుగను నిర్వహిస్తుంది, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 44 దేశాల నుండి దాదాపు 150 మంది ప్రతినిధులు ఇక్కడికి వస్తారు.

ఇది ఇలా ఉండగా, ఒక చిన్న పిల్ల గాలిపటం తీగలో చిక్కుకుని, దానితో పాటు గాల్లోకి ఎగిరిన వీడియో అహ్మదాబాద్‌లో సంభవించినట్లు సోషల్ మీడియాలో ఒక క్లెయిం వైరల్‌గా షేర్ అవుతోంది.

తెలుగులో క్లెయిం ఇలా సాగుతుంది: “అహ్మదాబాద్‌లో మూడేళ్ల బాలిక గాలింపుతో ఎగిరిపోయింది... దేవుడికి కృతజ్ఞతలు, క్షేమంగా కిందకు దిగింది...”



Full View


Full View

ఈ దావా ఆంగ్లంలో కూడా వైరల్‌గా షేర్ చేయబడింది.

Full View


Full View

వాట్సాప్‌లో కూడా వీడియో వైరల్‌గా మారింది.


నిజ నిర్ధారణ:

క్లెయిం అవాస్తవం. ఈ ఘటన 2020లో తైవాన్‌లో జరిగింది.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీ ఫ్రేమ్‌లను శోధించినప్పుడు, గత 2 సంవత్సరాలలో ఈ వీడియో అనేక సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ అవుతోందని తెలుస్తోంది.

టెక్నో మార్కెటింగ్ అనే పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీ ఈ వీడియోను సెప్టెంబర్ 2020లో షేర్ చేసింది, అయితే సంఘటన జరిగిన ప్రదేశం గురించి ప్రస్తావించలేదు.

Full View

"తైవాన్ ఫెస్టివల్‌లో ఒక పెద్ద గాలిపటం తో పాటు పిల్ల మీటర్ల ఎత్తు గాలిలోకి ఎగిరింది" అనే క్యాప్షన్‌తో వీడియో రెడ్‌డిట్‌లో కూడా షేర్ అయ్యింది.

https://www.reddit.com/r/PublicFreakout/comments/il2xfu/child_lifted_meters_into_the_air_by_a_giant_kite/

టైటిల్ నుండి క్యూ తీసుకొని, “తైవాన్ ఫెస్టివల్‌లో గాలిపటం తీగలలో చిక్కుకుని పాప గాల్లోకి ఎగిరింది” అనే కీవర్డ్‌లతో సెర్చ్ చేసినప్పుడు, ఆగస్టు 2020 నుండి మాకు అనేక వార్తా నివేదికలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పలు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ షేర్ చేశాయి.

ఆగస్టు 31, 2020న శెస్సిఎంపి ప్రచురించిన వీడియో ఇక్కడ ఉంది.

Full View

గార్డియన్ న్యూస్ ప్రచురించిన వీడియోపై వివరణ (ఇది గార్డియన్ వార్తాపత్రిక?) ఫుటేజీలో తైవాన్‌లోని 3 ఏళ్ల బాలిక గాలిపటం తీగలలో చిక్కుకున్న తర్వాత గాలిలోకి ఎగరడం చూపుతోంది. గుర్తుతెలియని బాలిక ఆదివారం సముద్రతీర పట్టణంలోని నాన్లియావోలో జరిగిన గాలిపటాల పండుగలో పాల్గొంటున్నప్పుడు, భారీ పొడవాటి తోక ఉన్న నారింజ రంగు గాలిపటం ద్వారా ఆమె అనేక మీటర్ల గాలిలోకి ఎగురవేయబడింది. ఈ ఘటనలో బాలిక భయపడిపోయిందని, అయితే శారీరకంగా ఎలాంటి గాయాలు కాలేదని వార్తా కథనాలు చెబుతున్నాయి.

Full View

వార్తా నివేదికల ప్రకారం, తైవాన్‌లోని మూడేళ్ల బాలిక గాలిపటం తీగలో చిక్కుకుంది, భయంతో ఉన్న చూపరుల ముందు గాలిలోకి ఎత్తబడింది. ఈ ఘటనలో బాలిక ఎలాంటి గాయాలు లేకుండా బయటపడింది.

రాజధాని తైపీకి దక్షిణంగా ఉన్న హ్సించు నగరంలో అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరుగుతోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యింది, చాలా మంది వ్యక్తులు ఉన్న చోట, పెద్ద గాలిపటం ఎగురవేయడానికి సన్నాహాలు జరుగాయి. దానికి ఉన్న పొడవాటి తోక ఉంది, ఆ గాలిపటం ఎగిరిన వెంటనే, తోక నుండి వేలాడుతున్న పసిపిల్ల కనపడింది. ఆమె నేలపై ఉన్న గాలిపటానికి ఎంత దగ్గరగా ఉందో, లేదా ఆమె ఎలా చిక్కుకుపోయిందో స్పష్టంగా తెలియదు.

https://edition.cnn.com/2020/08/31/asia/taiwan-child-kite-intl-hnk-scli/index.html

వీడియోలో, గాలిపటాన్ని తిరిగి భూమిపైకి లాగడానికి కష్టపడుతున్న పెద్దల సమూహాన్ని చూడవచ్చు. ఆ అమ్మాయికి సహాయం చేయడానికి సమీపంలో ఉన్న వ్యక్తులు పరుగెత్తడంతో గాలిపటం తోక సాపేక్షంగా నెమ్మదిగా నేలపైకి లాగి ఆమెను కాపాడడం చూడవచ్చు.

ఈ ఘటనలో బాలిక భయపడిపోయిందని, అయితే శారీరకంగా ఎలాంటి గాయాలు కాలేదని వార్తా కథనాలు చెబుతున్నాయి.

https://www.abc.net.au/news/2020-08-31/girl-in-taiwan-lifted-into-the-air-during-kite-accident/12611426

కనుక, వైరల్ వీడియోలో తైవాన్ నుండి 2020లో జరిగిన సంఘటన ను చూపిస్తుంది, ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో జరిగింది కాదు, ఇటీవలిది కాదు.

Claim :  Girl tangled in strings of Kite in Ahmedabad
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News