ఫ్యాక్ట్ చెక్: అయోధ్యరాముడిని దుర్భాషలాడిన NCP ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ ను కొట్టారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
ఒక వ్యక్తిని కొంతమంది ప్రజలు ఇష్టం వచ్చినట్లు కొడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో
ఒక వ్యక్తిని కొంతమంది ప్రజలు ఇష్టం వచ్చినట్లు కొడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఆ వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. ఒక ఈవెంట్‌లో ప్రజలు ఒక వ్యక్తిపై దాడి చేస్తున్నారని అందులో తెలిపారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దెబ్బలు తిన్న వ్యక్తి NCP ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ అని పోస్టులు పెట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు గానూ జితేంద్రపై ప్రజలు దాడి చేశారని వైరల్ పోస్టుల్లో పేర్కొన్నారు. రాముడు మాంసాహారి అంటూ జితేంద్ర ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియో లోని ఘటన.. మహారాష్ట్రలోని సాంగ్లీలో జూలై 2015లో చోటు చేయుకుంది. రచయిత బాబాసాహెబ్ పురందరే గురించి అప్పట్లో జితేంద్ర చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదం చెలరేగింది. ఆ కార్యక్రమంలో గొడవలు జరిగిన విషయాన్ని పలు మీడియా సంస్థలు వివరించాయి.
YouTube సెర్చ్ లో.. మేము పలు వార్తా నివేదికలలో లభించిన వివరాలను గుర్తించాం. జూలై 2015లో ఇండియా టుడే అప్‌లోడ్ చేసిన పూర్తి వీడియోను కనుగొన్నాము. స్టేజీ మీదనే ఈ గొడవ జరిగిందని మీడియా సంస్థలు ధృవీకరించాయి. ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారని మీడియా నివేదికను ఇక్కడ చూడొచ్చు.
మరో వీడియోలో జితేంద్ర తన అనుచరులతో కలిసి వెళ్లిపోవడాన్ని మనం గుర్తించవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్-ఇమేజ్ సెర్చ్ చేయగా.. జితేంద్ర YouTube ఖాతాకు దారితీసింది. ఆ వీడియోను నవంబర్ 2023లో పోస్ట్ చేశారు.
కాబట్టి, వైరల్ వీడియోను ఏ మాత్రం సంబంధం లేని రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోల ద్వారా సృష్టించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా పోస్టులను పెట్టారు. అయోధ్యరాముడిని దుర్భాషలాడిన NCP ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ ను కొట్టారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : A video viral on social media platform X, formerly known as Twitter, depicts a disturbing scene: a man is being assaulted by an angry crowd at an event. Users are claiming the victim is Jitendra Awhad, an NCP MLA.
Claimed By : X user
Fact Check : False