డెమోలిషన్ క్రేన్ ఒక వంతెన మీద వెల్తుండగా, ఆ వంతెన కూలిపోయే వీడియో సోషల్ మీడియాలో హిందీలో వైరల్ గా షేర్ అవుతోంది

దానిని అనువదించినప్పుడు "గుజరాత్‌లోని బసంకాంతలో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయిందని, వంతెన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదంటూ క్యాప్షన్ లో పేర్కొన్నారు.

Update: 2022-12-29 09:54 GMT

దానిని అనువదించినప్పుడు "గుజరాత్లోని బసంకాంతలో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయిందని, వంతెన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదంటూ క్యాప్షన్ లో పేర్కొన్నారు.


కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అదే క్లెయిం తో వంతెనపై ఉన్న క్రేన్ చిత్రాలను షేర్ చేసారు.


Full View


Full View

నిజ నిర్ధారణ:

వాదన తప్పుదారి పట్టించేది. వంతెన పాతది.

జాగ్రత్తగా గమనించగా, కుడి ఎగువ మూలలో న్యూస్ 18 లోగోను చూడవచ్చు. దీనిని క్లూగా తీసుకొని గుజరాత్లో బ్రిడ్జ్ కూలిపోవడంపై న్యూస్ 18 యూట్యూబ్ ఛానెల్ లో నివేదికల కోసం శోధించాము.

డిసెంబర్ 16, 2022న ప్రచురించబడిన న్యూస్ 18 వీడియో ప్రకారం, బనస్కాంతలోని బనాస్ నదిపై ఉన్న పాత వంతెనను సిబ్బంది కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వీడియోలో కనిపించిన సంఘటన జరిగింది. పాత బ్రిడ్జి పరిస్థితి బాలేక పోవడంతో అధికారులు కాంట్రాక్టర్ను నియమించి కూల్చివేసారు. బ్రిడ్జిని కూల్చే సమయంలో క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల వంతెన తో పాటు క్రేన్ కూడా కూలింది.

Full View

కూల్చివేత సమయంలో బనాస్ నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీనితో డెమొలిషన్ క్రేన్ నదీగర్భంలోకి పడిపోయిందని న్యూస్.ఏబిపిలైవ్ నివేదించింది. క్రేన్ పడిపోయిన తర్వాత కూడా నిటారుగా ఉండడంతో కార్మికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వంతెన దాదాపు 70 ఏళ్లనాటిది, గత 4 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. కాబట్టి అదే స్థలంలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పాతది మార్చాల్సిన అవసరం ఉంది.

ఇదే నివేదికను ఎన్డీటీవీ కూడా ప్రచురించింది.

కనుక, గుజరాత్లో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయిందనే వాదన తప్పుదారి పట్టించేది, గుజరాత్లోని పాత వంతెన కూలిపోయింది, అదే వీడియో తప్పుడు కధనం తో వైరల్ గా మారింది.

Claim :  Newly constructed bridge collapses in Guajarat
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News