ఫ్యాక్ట్ చెక్: గాజాలో భారీ భవంతి కూలిపోతున్న వీడియో ఇటీవల చోటు చేసుకున్నది కాదు

గాజా నుండి కొన్ని వందల మంది పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. 2,500 కంటే ఎక్కువ రాకెట్లు దూసుకొచ్చాయి.

Update: 2023-10-12 05:14 GMT

గాజా నుండి కొన్ని వందల మంది పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. 2,500 కంటే ఎక్కువ రాకెట్లు దూసుకొచ్చాయి. 250 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. చాలా మంది మహిళలను హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా “ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్” ప్రకటించింది, ఆ దేశ వైమానిక దళం పాలస్తీనా మిలిటెంట్లపై డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లతో దాడి చేసింది.

గాజాలోని ఒక భవనంపై బాంబు దాడిని చూపించే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది, ఇది "ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్"లో భాగంగా గాజాలోని ఒక టవర్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడికి సంబంధించినదని చెబుతున్నారు.

“We Stand with Israel. Israel launched Operation Iron Swords. Israel destroys third Gaza tower eliminated Palestinian Terrorists #Gaza #hamas #southernisrael #IsraelUnderAttack #OperationIronSwords #Palestine #Israel #War #AlMayadeen #Palestine #IndiaWithIsrael” అంటూ వీడియోను పోస్టు చేశారు. ఇజ్రాయెల్ గాజా టవర్ ను కూల్చి వేసిందని ఈ పోస్టుల్లో తెలిపారు.



Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఇది ఇటీవలి యుద్ధానికి సంబంధించినది కాదు. వైరల్ వీడియో ఇటీవలిది కాదు.. 2021లో గాజాలోని ఒక టవర్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులను చూపిస్తుంది.

జాగ్రత్తగా గమనించగా.. వీడియో ఎడమ వైపున అల్జజీరా లోగోను కనుగొన్నాము. ఈ క్లూతో, మేము Israel attacks on Tower in Gaza అనే కీవర్డ్స్ ను ఉపయోగించి అల్ జజీరా YouTube ఛానెల్ లో వీడియో కోసం సెర్చ్ చేశాం.

“This is the moment the 14-storey al-Shorouq tower, housing media offices in Gaza City, was completely destroyed by multiple Israeli air raids on Wednesday. “ అంటూ వీడియోను మే 14, 2021న అప్లోడ్ చేయడాన్ని మేం గుర్తించాం. "బుధవారం నాడు పలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా నగరంలోని మీడియా కార్యాలయాలు ఉన్న 14-అంతస్తుల అల్-షోరూక్ టవర్ పూర్తిగా ధ్వంసమైన క్షణం ఇది." అంటూ అందులో చెప్పుకొచ్చారు.

Full View

ఈ వీడియోను NBC న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో మే 13, 2021న ప్రచురించింది. “ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత గాజాలోని 14-అంతస్తుల భవనం కూలిపోయింది” అనే శీర్షికతో వీడియోను అప్లోడ్ చేశారు. వీడియో వివరణలో: “ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య ఘోరమైన దాడులు కొనసాగుతుండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల తరువాత గాజాలో 14-అంతస్తుల భవనం కూలిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. గాజా నగరంలో ఎత్తైన భవనాలలో ఇది ఒకటి, ఇందులో హమాస్ నడుపుతున్న టీవీ స్టేషన్‌తో సహా పలు మీడియా కార్యాలయాలు ఉన్నాయి.
Full View

ఇజ్రాయెల్ వైమానిక దాడి గాజాలోని అల్-షోరూక్ టవర్‌ను ధ్వంసం చేసినట్లు CNN ఒక నివేదికను ప్రచురించింది. ఈ సంఘటన గురించి CNN ఫోటో జర్నలిస్ట్ ఇబ్రహీం దహ్మాన్ నివేదించారు. మే 10, 2021న ఇరు దేశాల మధ్య గొడవలు ప్రారంభమైనప్పటి నుండి IDF ధ్వంసం చేసిన మూడవ ఎత్తైన భవనం ఇదని మీడియా సంస్థలు తెలిపాయి. ఏదైనా ప్రాణనష్టం జరిగిందా లేదా.. అనేదిస్పష్టంగా తెలియలేదు.

గాజాలో ఒక ఎత్తైన భవనం కూలిపోయినట్లు చూపించే వైరల్ వీడియో ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించినది కాదు. ఈ వీడియో మే 2021లో రికార్డు అయింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  The video shows the destruction of a tower in Gaza by Israel
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News