ఫ్యాక్ట్ చెక్: వీడియో లో వ్యక్తులు VVPAT స్లిపులను దొంగలించడం లేదు, వీడియో పాతది.

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయి. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు బీజేపీకి బాగా తగ్గాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి.

Update: 2024-06-08 05:17 GMT

VVPAT

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయి. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు బీజేపీకి బాగా తగ్గాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తెలంగాణ, కేరళ, ఒడిశాలో ఆ పార్టీకి అనుకున్నదాని కంటే చాలా తక్కువ సీట్లు వచ్చాయి. అయితే అతి పెద్ద పార్టీగా నిలవడం.. ఎన్.డి.ఏ. లోని ఇతర పార్టీలు తగినన్ని సీట్లతో మద్దతు ఇస్తూ ఉండడంతో కూటమికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ద్వారా ఎన్డీయే అధికారం చేపట్టనుంది.

ఇంతలో, కొంతమంది వ్యక్తులు ఈవీఎం మెషీన్ల నుండి VVPAT స్లిప్పులను తీసి కవర్‌లో ఉంచుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతూ ఉంది. ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి కవరును మూసివేసి సీల్ చేసి, ఆపై పెట్టెను మూసేస్తున్నట్లు వీడియోలో మనం చూడొచ్చు.
వీడియోతో పాటు భిన్నమైన కామెంట్స్ చూడవచ్చు.
కొందరు యూజర్లు భిన్నమైన వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు వీవీప్యాట్ స్లిప్పులను మార్చేస్తూ ఉన్నారంటూ పోస్టులు పెడుతున్నారు. లోక్ సభ ఎన్నికలు నిజాయితీగా జరగలేదని చెబుతున్నారు.
దయచేసి ఈ వీడియోను మీ అన్ని గ్రూపులలో ఫార్వార్డ్ చేయండి, తద్వారా ఇది సుప్రీంకోర్టుకు చేరుతుంది. అర్జంట్ దయచేసి’ అంటూ వీడియోను వాట్సాప్ లోపోస్టు చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2024 ఎన్నికల సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తెలుసుకున్నాం.

మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆ వీడియో 2 సంవత్సరాల పాతదని, డిసెంబర్ 2022 నుండి ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉందని మేము కనుగొన్నాము.

“Free and fair elections”?! Anyway under a cloud because of its seemingly partisan functioning, EC must probe and clarify the details of this video!" అంటూ ట్వీట్ పెట్టడం మేము గమనించాం. ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చింది.. ఈ విషయంపై ఈసీకి సమాచారాన్ని ఇచ్చారు.. దయచేసి దీనిపై విచారణ చేసి, సరైన సమాచారం ఇవ్వండంటూ పోస్టులు పెట్టారు.
ఇదే వీడియోను 2022లో పోస్టు చేయగా.. భావ్‌నగర్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కామెంట్లు చేశారు "ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు తర్వాత, VVPAT యంత్రాల నుండి స్లిప్పులను తీసివేసి, నల్ల కవరులో సీలు చేస్తారు. తద్వారా VVPAT యంత్రాలను తదుపరి ఎన్నికలకు ఉపయోగించవచ్చు. మొత్తం ప్రక్రియ వీడియోగ్రాఫ్ చేస్తారు. ఒక కాపీని స్ట్రాంగ్ రూమ్‌కు, మరొకటి సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి (DEO)కి పంపుతారు" అని వివరణ ఇచ్చారు.
భారత ఎన్నికల సంఘం పేరుతో ఉన్న ఓ సర్క్యులర్‌ను కూడా మేము కనుగొన్నాము. ఇది కౌంటింగ్ అధికారులకు ఎన్నికలు పూర్తయ్యాక చేయాల్సిన పనులను సూచిస్తుంది. VVPAT మెషిన్ డ్రాప్ బాక్స్ నుండి VVPAT స్లిప్‌లను తీసివేయాలని, ఆపై స్లిప్‌లను కలిగి ఉన్న ఎన్వలప్‌లను మందపాటి నల్ల కాగితం ఎన్వలప్‌లలో ఉంచి, ఎరుపు మైనపుతో సీలు వేయాలని, అలాగే ద్విభాషా రహస్య ముద్రను ఉంచాలని సూచనలలో పేర్కొంది.

వైరల్ వీడియోలోని వ్యక్తులు అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు మనం చూడవచ్చు. అందువల్ల, వైరల్ వీడియోలో వ్యక్తులు EVM మెషీన్ల నుండి VVPAT స్లిప్‌లను దొంగిలించలేదు. కౌంటింగ్ తర్వాత ఈసీఐ సిబ్బంది మెషీన్ల నుంచి స్లిప్పులను తీసి సీల్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇవి ECI సూచనల ప్రకారం జరుగుతాయి.
వీడియో 2022 నుండి వైరల్ అవుతూ ఉంది. వైరల్ అవుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim :  2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తులు VVPAT స్లిప్పులను దొంగిలిస్తున్నారు.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News