ఫ్యాక్ట్ చెక్: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారాన్ని హైవేపై ప్రయాణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ వీక్షిస్తున్న వీడియో మార్ఫింగ్ చేశారు
జూన్ 9, 2024న 71 మంది మంత్రులతో కలిసి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్- ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
జూన్ 9, 2024న 71 మంది మంత్రులతో కలిసి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్- ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత 10 ఏళ్లుగా దేశ ప్రధానిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించి మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రితోపాటు మరో 71 మంది కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ఆమోదించింది. రాహుల్ గాంధీ వాహనంలో ప్రయాణిస్తూ ఉండగా.. కారులోని టీవీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. ‘Meanwhile, Somewhere on a highway built by Nitin Gadkari #Modicabinet’ అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్ అవుతోంది.
మోదీ కేబినెట్ లో నిర్మించిన రోడ్డు మీద రాహుల్ గాంధీ కారులో వెళుతూ ఇలా వీడియోను చూస్తున్నారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో పాతది, రాహుల్ గాంధీ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షిస్తున్నట్లు ఒరిజినల్ వీడియోలో ఎక్కడా లేదు.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించగా.. వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారని మేము కనుగొన్నాము. “Next PM Rahul Gandhi coming on 4th June” అనే క్యాప్షన్ తో వీడియోను ఏప్రిల్ 25, 2024న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీడియో నుండి సంగ్రహించిన ఒక చిత్రాన్ని మే 17, 2024న ఒక X వినియోగదారు షేర్ చేసారు. తర్వాతి రోజు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో సాయంత్రం 6.30 గంటలకు రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని అందులో ఉంది.
అసలు విజువల్స్‌లో, అక్కడి ఎలక్ట్రానిక్ డివైజ్ ఆఫ్‌లో ఉంది. రాహుల్ గాంధీ అందులో ఏమీ చూడటం లేదు. ఒరిజినల్ వీడియోలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవ వీడియోను డిజిటల్‌గా జోడించారు.
రెండు వీడియోల మధ్య తేడాలను గమనించవచ్చు :
కాబట్టి, రాహుల్ గాంధీ వాహనంలో ప్రయాణిస్తూ మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియోను మార్ఫింగ్ చేశారు.
Claim : మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ వీడియోను రాహుల్ గాంధీ వీక్షిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి
Claimed By : Social media users
Fact Check : False