ఫ్యాక్ట్ చెక్: వీడియోలో కరాటే విన్యాసాలు చేస్తున్న వ్యక్తి తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కాదు
క్రీడలు మరియు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.
క్రీడలు మరియు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 1, 2023న కార్యక్రమానికి సంబంధించిన వీడియో, బ్రోచర్ విడుదల కార్యక్రమంలో క్రీడల మంత్రి రోజా, సాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు.
తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి కరాటే విన్యాసాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి తన తలతో నిప్పులతో ఉన్న పలకలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుండగా, అతని జుట్టుకు మంటలు అంటుకున్నాయి. అతనికి సహాయం చేయడానికి స్టేజీ మీద ఉన్న వ్యక్తులు పరిగెత్తారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అనే వాదనతో వైరల్ వీడియో ప్రచారంలో ఉంది. “ఆడుదాం ఆంధ్రా” అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
“శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రా" ప్రోగ్రాం లో భాగంగా తన విజ్ఞానాన్ని (కరాటే ప్రతిభను) పై విధంగా ప్రదర్శించారు....ఇంకా నయం గోరంట్ల మాధవ్ ఆడే ఆట ప్రదర్శించ లేదు” అంటూ పోస్టులు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న వీడియో ఎక్కడా కనిపించలేదు.బియ్యపు మధుసూదన్ రెడ్డి అనే పేరుతో వెతికితే ఇంటర్నెట్‌లో అలాంటి వీడియోలేవీ కనిపించలేదు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వివరాలను వెతికితే, ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి ఆర్కే రోజా, సాప్ (ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, సాప్ ఎండీ ధ్యానచంద్ర మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గురించి మీడియాకు వివరించినట్లు వార్తా కథనాలు వచ్చాయి. 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను కూడా వారు విడుదల చేశారు. క్రికెట్, ఖో-ఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్‌తో సహా 5 పోటీ క్రీడలకు నాకౌట్ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా 5 స్థాయిలలో (గ్రామం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం) నిర్వహించనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఈవెంట్లను నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. బియ్యపు మధుసూధన్ రెడ్డి అలాంటి ఈవెంట్ లో కనిపించలేదు.
మేము సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఆ వీడియోలో ఉన్నది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అని.. అతడు కరాటే విన్యాసాలు చేస్తున్నాడని.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కాదని మేము కనుగొన్నాము.
గలాట్టా తమిళ్ అనే యూట్యూబ్ ఛానెల్ 6 జనవరి 2014న “అధిరాది మూవీ లాంచ్‌లో మన్సూర్ అలీ ఖాన్‌కు షాకింగ్ యాక్సిడెంట్” శీర్షికతో వైరల్ వీడియోను ప్రచురించింది. వీడియోలో, నటుడు మన్సూర్ అలీ ఖాన్ విన్యాసాలు చేయడం మనం చూడవచ్చు.
Full View
గలాట్టా తమిళ్ ప్రచురించిన మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము, ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ సినిమా అధిరాడి లాంచ్ లో అనేక ఇతర విన్యాసాలు చేయడం చూడవచ్చు.
Full View
IMDb ప్రకారం, అధిరాడి చిత్రానికి మన్సూర్ అలీ ఖాన్ రైటర్ గా బాధ్యతలు చేపట్టడమే కాకుండా..నటించాడు కూడా..! ఈ సినిమా అక్టోబర్ 2015 లో విడుదలైంది.
వేదికపై కరాటే విన్యాసాలు చేస్తున్న వీడియో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ది. అంతేకానీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిది కాదు. వైరల్ అవుతున్న వాదన లో ఎటువంటి నిజం లేదు.

Claim : The video shows an MLA from Srikalahasthi, Andhra Pradesh, participating in a game show and getting hurt
Claimed By : Social media users
Fact Check : False