ఫ్యాక్ట్ చెక్: రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆఫీసులో డాక్టర్ అంబేద్కర్ ఫోటోను ఉంచలేదు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయంలో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచారని చెబుతున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతదేశాన్ని గౌరవించటానికి రష్యా ఈ చర్యకు పూనుకుందంటూ పలువురు పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయంలో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచారని చెబుతున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతదేశాన్ని గౌరవించటానికి రష్యా ఈ చర్యకు పూనుకుందంటూ పలువురు పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ 132వ జయంతిని జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. “రష్యన్ అధ్యక్షుడు మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్ తన కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఫోటో ఉంచారు.... భారతదేశానికి గొప్ప గౌరవం.!” అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేశారని గుర్తించాం.రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఒరిజినల్ ఫోటో లభించింది. స్టాక్ ఇమేజ్ వెబ్ సైట్ Alamy లో కనిపించింది. ఫిబ్రవరి 15, 2007 న ఈ ఫోటో ను అప్లోడ్ చేశారు. రష్యా జెండా, రష్యా ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. అది రష్యన్ సెక్యూరిటీ ఆఫీసు అని కూడా తెలిపారు.ఆర్థిక పరమైన విషయాలపై పుతిన్ ఒక సదస్సును నిర్వహించినట్లు వివరణలో పేర్కొన్నారు. “Russian President Vladimir Putin holding conference on economic issues in the Kremlin From left to right Sergei Ignatyev…..” అని ఆ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చారు.
ఒరిజినల్ ఫోటోకు వైరల్ ఫోటోకు మధ్య ఉన్న తేడాలను మీరు గుర్తించవచ్చు.
కాన్ఫరెన్స్ గదికి సంబంధించిన ఇదే విధమైన చిత్రాన్ని రష్యా అధ్యక్షుడి కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. ఆ చిత్రం నవంబర్ 27, 2001 నాటిది. చిత్రంలో అంబేద్కర్ ఫోటోకు బదులుగా రష్యన్లకు సంబంధించిన చిహ్నం ఉంది. "వ్లాదిమిర్ పుతిన్ భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు", "భద్రతా మండలి సమావేశంలో అధ్యక్షుడు పుతిన్" ("Vladimir Putin chaired a Security Council session” , “President Putin at a Security Council session.”) అనే శీర్షికతో చిత్రం ఉంది.
వైరల్ చిత్రం నకిలీదని స్పష్టంగా తెలుస్తోంది. డాక్టర్ భీంరావు అంబేద్కర్ జయంతి సందర్భంగా పుతిన్ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఉంచలేదు. వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారు.వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : A portrait of Dr. Bhimrao Ambedkar was hung up in Putin's office on the occasion of Ambedkar’s birthday.
Claimed By : Social Media Users
Fact Check : False