నిజ నిర్ధారణ: చిత్రంలో కనబడుతున్న ఉగ్రనరసింహదేవర శిల్పం టర్కీ-సిరియా సరిహద్దు ల్లోని త్రవ్వకాలలో లభించింది కాదు

టర్కీ-సిరియా సరిహద్దు సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభించిన నరసింహ స్వామి శిల్పాన్ని చూపుతున్నట్లుగా ఓ చిత్రం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

Update: 2022-10-28 04:25 GMT

టర్కీ-సిరియా సరిహద్దు సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభించిన నరసింహ స్వామి శిల్పాన్ని చూపుతున్నట్లుగా ఓ చిత్రం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

ఈ చిత్రం 2020లో ఫేస్ బుక్, ట్విట్టర్ లో వైరల్‌గా షేర్ అయ్యింది. అదే చిత్రం ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సాప్ లలో మళ్లీ షేర్ అవుతోంది.

కొంతమంది వినియోగదారులు "ఉగ్రనరసింహదేవర" అనే ఆంగ్ల శీర్షికతో చిత్రాన్ని పంచుకున్నారు. "ఆగ్నేయ టర్కిష్-సిరియా సరిహద్దుల్లోని టైగ్రిస్-యూఫ్రేట్స్ (మెసొపొటేమియా)లో త్రవ్వకాలలో 3,200 సంవత్సరాల నాటి నరసింహ స్వామి విగ్రహం లభించింది" అంటూ షేర్ చేసారు.

మరికొందరు హిందీలో "" అంటూ పంచుకున్నారు

Full View


Full View

నిజ నిర్ధారణ:

వైరల్ చిత్రం టర్కీ-సిరియా సరిహద్దులో జరిగిన తవ్వకాలలో దొరికిన శిల్పాన్ని చూపుతుందన్న వాదన అవాస్తవం. ఈ చిత్రం బాలిలోని కుటా బీచ్ లోని దేవాలయంలో ఒక శిల్పానిది.

ముందుగా, మేము టర్కీ-సిరియా సరిహద్దు సమీపంలో తవ్వకాల గురించి శోధించినప్పుడు, పురాతన నగరమైన కర్కెమిష్‌లో చేపట్టిన తవ్వకాల గురించి కొన్ని కథనాలు లభించాయి. ఏ నివేదికలోనూ వైరల్ ఇమేజ్‌లో ఉన్న శిల్పాన్ని పోలిన శిల్పం కనిపించినట్లు దాఖలాలు లేవు.

https://phys.org/news/2012-11-archaeologists-explore-site-syria-turkey-border.html

https://www.cbc.ca/news/world/karkemish-archaeologists-dig-metres-away-from-isis-controlled-territory-1.2836599

యాండ్క్స్ సెర్చ్ ఇంజిన్‌ని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, విర్ టూరిస్ట్.కాం అనే వెబ్‌సైట్‌లో కథనం లభించింది. బాలిలోని కుటా బీచ్‌లో ఉన్న హిందూ దేవాలయ ప్రవేశ ద్వారం పై ఉన్న విగ్రహాలలో ఒకదానిని చిత్రం చూపుతుందని వెబ్‌సైట్ పేర్కొంది.

'కుటా బీచ్, బాలి వద్ద దేవాలయాలు' అనే కీలక పదాలతో వెతుకినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ఆలయాలు లభించాయి. ఈ ఆలయాలన్నీ వాటి ప్రవేశద్వారం వద్ద ఒకే విధమైన శిల్పాలను కలిగి ఉన్నాయి.

ట్రిప్ అడ్వైజర్ వెబ్ సైట్ ఈ శిల్పం 'దలేం పెనాతరం దేశా అదాత్' అనే ఆలయానికి చెందినదని పేర్కొంటూ ఒక చిత్రాన్ని పంచుకుంది.


గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించి, ఆలయ చిత్రాల కోసం శోధించినప్పుడు, ఫిబ్రవరి 2013లో ఒక వినియోగదారు పోస్ట్ చేసిన చిత్రం లభించింది, వైరల్ ఇమేజ్‌కి సమానమైన శిల్పాన్ని చూపుతుంది.

జాగ్రత్తగా గమనించినప్పుడు, రెండు చిత్రాలు ఒకే శిల్పం అని తెలుస్తోంది.


అందువల్ల, వైరల్ చిత్రం టర్కీ-సిరియా సరిహద్దుల్లో జరిగిన త్రవ్వకాలలో లభించిన 3,200 సంవత్సరాల నాటి శిల్పం కాదు. క్లెయిం అబద్దం.

Claim :  Viral image shows Sculpture found in excavation near Turkey- Syria border
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News