ఫ్యాక్ట్ చెక్: ప్రధాని మోదీ ముందు టీడీపీ అధినేత చేతులు కట్టుకుని నిలుచున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి, ఫిబ్రవరి 7, 2024న బిజెపి పార్టీ నాయకులు అమిత్ షా, జెపి నడ్డాతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి, ఫిబ్రవరి 7, 2024న బిజెపి పార్టీ నాయకులు అమిత్ షా, జెపి నడ్డాతో సమావేశమయ్యారు. నివేదికల ప్రకారం, ఈ సమావేశం దాదాపు గంటపాటు కొనసాగింది. జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీయే కూటమిలో ఉండగా.. తెలుగుదేశం పార్టీ కూడా చేరడంపై చర్చలు జరిగాయి. జనసేన-టీడీపీ-బీజేపీల మైత్రికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ యువతతో కలిసి కూర్చుని వారితో మాట్లాడుతుండగా, చంద్రబాబు నాయుడు ముకుళిత హస్తాలతో మెట్రోలో నిలబడి ఉన్నట్లు వైరల్ చిత్రం చూపిస్తుంది.
ఢిల్లీ మెట్రోలో ఇదే దృశ్యమని.. ప్రధాని మోదీ టీడీపీ అధినేతను అవమానిస్తున్నారనే వాదనతో ఈ చిత్రం వైరల్ అవుతూ ఉంది.
ఢిల్లీ మెట్రోలో ఇదే దృశ్యమని.. ప్రధాని మోదీ టీడీపీ అధినేతను అవమానిస్తున్నారనే వాదనతో ఈ చిత్రం వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఢిల్లీ మెట్రోలో భారత ప్రధాని మోదీ ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు లేరు. తప్పుడు కథనాన్ని ప్రచారం చేయడానికి మార్ఫింగ్ చేశారు.మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని సెర్చ్ చేశాం.. ఒరిజినల్ ఫోటో జూన్ 2023 నుండి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. దీన్ని పలు మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. ఆ ఫోటోలలో చంద్రబాబు నాయుడు లేరని మేము కనుగొన్నాము.
అసలు చిత్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 30, 2023న “ఢిల్లీ మెట్రో ద్వారా DU కార్యక్రమానికి వెళ్లే మార్గంలో” అనే శీర్షికతో షేర్ చేశారు. యువత నా తోటి ప్రయాణీకులుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, మెట్రో రైలులో ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవానికి వెళ్లే సమయంలో ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర, తదితర అంశాలపై వారితో చర్చించారు.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఆయన లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కారు. పసుపు లైన్‌లోని విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్‌లో దిగారు.
ANI న్యూస్ యూట్యూబ్ ఛానెల్ 30 జూన్ 2023న ఢిల్లీ మెట్రోలో భారత ప్రధానితో విద్యార్ధుల సంభాషణకు సంబంధించిన వీడియోను ప్రచురించింది. వీడియోలోని 3.06 నిమిషాల సమయంలో వైరల్ ఇమేజ్‌కి సమానమైన దృశ్యాలను మనం చూడవచ్చు.
Full View
అందుకే, వైరల్ అవుతున్న చిత్రంలో ఎలాంటి నిజం లేదు. ఢిల్లీ మెట్రోలో భారత ప్రధాని మోదీ ముందు చంద్రబాబు నాయుడు చేతులు జోడించి నిలుచోలేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారు.

Claim : The viral image shows Telugu Desam Party boss Chandrababu Naidu standing with folded hands in front of Indian PM Modi
Claimed By : Twitter users
Fact Check : False