వైరల్ చిత్రం లో ఉన్నది షింజో అబే యొక్క షూటర్ కాదు, అమెరికన్ హాస్యనటుడు సామ్ హైడ్

జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే జూన్ 8, 2022న నారాలో రాజకీయ ప్రచారంలో ఉండగా ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. అదే రోజున ఆయన ఆసుపత్రిలో మరణించారు.

Update: 2022-07-11 11:42 GMT

జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే జూన్ 8, 2022న నారాలో రాజకీయ ప్రచారంలో ఉండగా ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. అదే రోజున ఆయన ఆసుపత్రిలో మరణించారు.

ఈ సంఘటన తర్వాత, అబేను చంపిన షూటర్ గురించి ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అనేక ఖాతాలు అబేను చంపిన షూటర్ "సంజుకీ హయదైకో"ని చూపుతున్నట్లు ఒక చిత్రాన్ని షేర్ చేయడం ప్రారంభించాయి. అతను రాజకీయ తీవ్రవాది, యాకూజా సభ్యుడు అంటూ కూడా వ్యాఖ్యానించాయి.

వైరల్ చిత్రం ఈ క్యాప్షన్ తో షేర్ చేయబడుతోంది " BREAKING: #ShinzoAbe యొక్క షూటర్ సంజుకి హైదైకో గా గుర్తించారు. అతను ఒక పేరొందిన రాజకీయ తీవ్రవాది, యాకూజా సభ్యుడు"


ఈ వాదన సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.
నిజ నిర్ధారణ:


వైరల్ చిత్రం జపాన్ మాజీ ప్రధాని షింజో అబే షూటర్‌ను చూపుతోందనీ, అతని పేరు సంజుకి హైదైకో అనే వాదన అబద్దం. వైరల్ చిత్రం అమెరికన్ హాస్యనటుడు, కళాకారుడు సామ్ హైడ్‌ను చూపుతోంది.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి షింజో అబే హంతకుడుగా షేర్ చేయబడిన ఇమేజ్ ను సెర్చ్ చేసినప్పుడు, గ్యారీ ఎన్వార్డ్స్ అనే ఛానెల్ ద్వారా సెప్టెంబర్ 2018లో అప్‌లోడ్ చేయబడిన "సామ్ హైడ్ స్టిల్ ఎ నిగ్గా" అనే యూట్యూబ్ వీడియో నుండి తీసుకోబడినట్లు తెలుస్తోంది.


పోల్చి చూస్తే, వీడియఒ లో నుండి తీసిన చిత్రం వైరల్ క్లెయిం లో ఉపయోగించిన చిత్రాన్ని పోలి ఉండడం గమనించవచ్చు.


క్లెయిమ్‌తో షేర్ చేయబడిన మరొక వైరల్ ఇమేజ్ కోసం వెతకగా 'గెట్టింగ్ అవే విత్ ఇట్' అనే డాక్యుమెంటరీలోని ఈండ్భ్ పేజీకి దారి తీసింది. ఈ చిత్రం కూడా ఊశ్ హాస్యనటుడు సామ్ హైడ్‌కి చెందినదే.

https://www.imdb.com/title/tt17634306/

బ్బ్చ్.చొం ప్రకారం, షింజో అబేపై కాల్పులు జరిపిన నిందితుడు నారా స్థానిక నివాసి అయిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి. అతను జపాన్ నావికాదళానికి సమానమైన సముద్ర స్వీయ-రక్షణ దళ మాజీ సభ్యుడు అని తెలుస్తోంది.

https://www.bbc.com/news/world-asia-62094363

నివేదికల ప్రకారం, తెత్సుయా యమగామి మాజీ ప్రధాని పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, అతను అబేను కాల్చడానికి స్వయంగా తయారు చేసిన తుపాకీని ఉపయోగించాడు.

కాల్పులు జరిగిన వెంటనే సెక్యూరిటీ గార్డులు అతడిని పట్టుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత అనుమానితుడి వీడియోలు, చిత్రాలను అనేక ప్రచురణలు పంచుకున్నాయి.

https://www.yahoo.com/news/videos-show-shinzo-abe-shooting-130017850.html

https://zeenews.india.com/india/i-was-unhappy-with-shinzo-abes-assassin-reveals-why-he-did-not-even-try-to-escape-from-the-spot-2483125.html

https://www.newindianexpress.com/world/2022/jul/08/shinzo-abes-assassinsaid-gun-he-used-washandmade-japanese-police-2474384.html

అందువల్ల, వైరల్ చిత్రం జపాన్ మాజీ ప్రధాని షింజో అబే షూటర్‌ను చూపుతోందనీ, అతని పేరు సంజుకి హైదైకో అనే వాదన అబద్దం.

Claim :  Viral image shows the shooter of Shinzo Abe
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News