ఫ్యాక్ట్ చెక్: మతమార్పిడులపై ఆర్ఎస్ఎస్ లెటర్లంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ముస్లిం మహిళలను ప్రేమించి వారిని హిందూ మతంలోకి మార్చమని హిందూ పురుషులను ప్రోత్సహిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ లేఖలు జారీ చేసింది అనే కథనంతో రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ముస్లిం మహిళలను ప్రేమించి వారిని హిందూ మతంలోకి మార్చమని హిందూ పురుషులను ప్రోత్సహిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ లేఖలు జారీ చేసింది అనే కథనంతో రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిముస్లిం యువతులను ఎలా ట్రాప్ చేయాలో తెలుపుతూ 12 పాయింట్లను వివరించారంటూ పోస్టులు పెట్టారు. హిందూ అబ్బాయిలు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ముస్లిం అమ్మాయిలను తిరిగి హిందూమతంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, మరిన్ని వివరాలను తెలుసుకోడానికి 15 రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలని లేఖలో పేర్కొన్నారు.చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ లేఖను #bhagwalovetrap #islamophobia మొదలైన హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్ చేశారు. వినియోగదారులు ముస్లిం మహిళలను సోషల్ మీడియాలో హెచ్చరించారు.- మీరు ఒక ముస్లిం అమ్మాయిని కలిసినప్పుడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి వ్యక్తిగా నటించండి- ముస్లిం అమ్మాయిలతో ఎప్పుడూ కరచాలనం చేయండి- వారి ధర్మాన్ని అవమానించకుండా ప్రయత్నించండి, వారి ముందు ఇస్లాంను ప్రశంసించండి- మీరు ఆమెను కలిసినప్పుడు, ఆమె హిజాబ్‌ను ప్రశంసించండిలేఖలో ఇలాంటి మరిన్ని అంశాలు ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. లేఖకు సంబంధించిన వైరల్ చిత్రాలు మార్ఫింగ్ చేశారు. ఈ లెటర్ లను RSS విడుదల చేయలేదు. జాగ్రత్తగా గమనించగా.. లేఖలో ఉపయోగించిన హిందీ భాషలో అనేక తప్పులు కనిపించాయి.వైరల్ లెటర్ హెడ్, అధికారిక లెటర్ హెడ్ మధ్య కూడా కొన్ని వ్యత్యాసాలు కనుగొన్నాము. అధికారిక లెటర్‌హెడ్‌లోని లోగోలోని రంగు, వైరల్ లెటర్‌హెడ్‌లోని లోగో రంగు భిన్నంగా ఉంటుంది.ఒరిజినల్ లెటర్‌హెడ్‌లో కుంకుమపువ్వు రంగులో ఉన్న వృత్తం లోపల ఓం చిహ్నానికి ఎగువ ఎడమవైపు ‘సంఘే శక్తి: కలయుగే’ ట్యాగ్‌లైన్ ఉంది. వైరల్ లెటర్‌హెడ్‌లో ఈ ట్యాగ్‌లైన్ లేదు.. ఓం గుర్తులో కూడా తేడాలని గమనించాం.
వైరల్ లెటర్ ఫేక్ అని ఆల్ ఇండియా ప్రచార్ ప్రముఖ్, ఆర్ఎస్ఎస్, సునీల్ అంబేకర్ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్ లో “यह राष्ट्रीय स्वयंसेवक संघ के नाम पर सोशल मीडिया में चल रहा पत्रक पूर्णतः झूठा है।“ చెప్పారు . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖ పూర్తిగా నకిలీదని ఆయన స్పష్టం చేశారు.
ట్విట్టర్ హ్యాండిల్ VSK భారత్ కూడా RSS పరువు తీసేందుకు అరాచక శక్తులు చేస్తున్న మరో విఫల ప్రయత్నమని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సంఘ్ లెటర్‌హెడ్‌పై సర్సంఘచాలక్ జీ పేరుతో తప్పుడు లేఖ వైరల్ అవుతోందని తెలిపింది.
కాబట్టి, RSS లెటర్స్ అంటూ షేర్ చేస్తున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim : RSS letter calling Hindu youth to trap Muslim women
Claimed By : Social Media Users
Fact Check : False