ఫ్యాక్ట్ చెక్: అయోధ్య రైల్వే స్టేషన్‌ను చూపుతున్న వైరల్ చిత్రాలను AI ద్వారా రూపొందించారు
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఆలయ ట్రస్టు చెబుతోంది.
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఆలయ ట్రస్టు చెబుతోంది. జనవరి 2024 లో భక్తులను దర్శనం కోసం అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. భారతీయ రైల్వే కూడా జనవరి 15, 2024 నాటికి అయోధ్య రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను పూర్తి చేయడానికి సిద్ధమైంది.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొన్ని చిత్రాలను షేర్ చేసి.. అయోధ్య రైల్వే స్టేషన్ కు సంబంధించిన వీడియో అని చెబుతున్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలా రైల్వే స్టేషన్ తలపిస్తోంది. రైల్వే స్టేషన్ గోడలపై శ్రీరాముని ఫోటోలతో రైల్వే స్టేషన్ ఉందని ఆ ఫోటోలలో కనిపిస్తోంది. అయితే రైల్వే స్టేషన్ పేరులో చాలా స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి.
“అయోధ్య రైల్వే స్టేషన్ ను వచ్చే జనవరిలో జరిగే రామ మందిరం ప్రారంభం నాటికి ఈ నమూనాల తరహాలో అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు ఇప్పటికే కొంతకాలంగా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో రైల్వే స్టేషన్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం తరహాలో మారనుంది.” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ చిత్రాలు AI ద్వారా రూపొందించారు. అందులో ఉన్నది అసలైన అయోధ్య రైల్వే స్టేషన్ కు సంబంధించినవి కావు.ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య రైల్వే స్టేషన్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అయోధ్యకు అనేక రైళ్లను నడుపుతోంది. ఈ నగరానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు.
“Redevelopment of Ayodhya Railway Station” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది ప్రభుత్వం. అయోధ్య రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని చెబుతూ రైల్వే మంత్రిత్వ శాఖ కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. శ్రీ రామ జన్మభూమి దేవాలయం నుండి ప్రేరణ పొందిన శిల్పాలు అందులో ఉన్నాయి. చాలా వరకూ పనులు పూర్తయే అయ్యాయని.. స్టేషన్ బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతాలకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
ఈ చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ పోస్ట్ జూలై 20, 2023న సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
జనవరి 2023లో రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా మేము కనుగొన్నాము.
అదే యూజర్ పలు విషయాలను వివరిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను పెట్టారు. ఒక మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయని అని అందులో తెలిపారు. అయితే ఆ ఫోటోలను చూసి కొందరికి సమస్యలు కూడా వచ్చాయని తెలిపారు. ఈ చిత్రాలను ఏఐ ద్వారా రూపొందించామని తెలిపారు. అయోధ్య రైల్వే స్టేషన్ ఇంకా బెటర్ గా తీర్చిదిద్దవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వివరించాడు సదరు యూజర్. ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ బిల్డింగ్ బాగుందని.. అయితే అంతకంటే గొప్పగా కూడా చేయొచ్చని తెలిపారు. @Amarrrrz అకౌంట్ లో ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలను గమనించవచ్చు.
కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలు AI ద్వారా రూపొందించారు. అయోధ్యలో పునర్నిర్మిస్తున్న అసలు రైల్వే స్టేషన్ కు సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral images show state-of-the-art railway station in Ayodhya
Claimed By : Social media users
Fact Check : False