ఫ్యాక్ట్ చెక్: కిడ్నీలు అందుబాటులో ఉన్నాయంటూ వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరి కిడ్నీలు మార్పిడికి అందుబాటులో ఉన్నాయని ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Update: 2024-08-03 04:00 GMT

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరి కిడ్నీలు మార్పిడికి అందుబాటులో ఉన్నాయని ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “ప్రియమైన అందరికి ముఖ్యమైన విషయం, 4 కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి. నిన్న ప్రమాదానికి గురైన మా స్నేహితుడు సుధీర్ మరియు అతని భార్య (నా స్నేహితుడి సేవా సహోద్యోగులు) మరణించిన కారణంగా, డాక్టర్ వారిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. Mr. సుధీర్ B+ మరియు అతని భార్య O+. అతని కుటుంబం మానవత్వం కోసం వారి కిడ్నీలను దానం చేయాలని కోరుకుంటుంది .Plz circulate.

9837285283లో సంప్రదించాలి, 9581544124, 8977775312. మరొక Group కి ఫార్వార్డ్ చేయండి, ఇది ఎవరికైనా సహాయం చేయగలదు. గ్రూప్ సభ్యులు ఒక్కసారి ఈ msg చూడండి. Iite తీసుకునే మ్యాటర్ కాదు. ఇంత గొప్ప సహాయం చేసే ఆ కుటుంబాలకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ” అంటూ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ పోస్టు ఒక బూటకం. నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని పలువురు షేర్ చేస్తున్నారు.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం.. ఈ సందేశం చాలా సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో ఉందని మేము కనుగొన్నాము. నవంబర్ 2022లో ప్రచురించిన X(గతంలో ట్విట్టర్) పోస్ట్ ఇక్కడ ఉంది.
ఆగస్టు 2019లో అప్లోడ్ చేసిన X పోస్ట్ ఇక్కడ చూడొచ్చు
మేము ఆగస్టు 2018లో ఆంగ్లంలో ప్రచురించిన ఒక పోస్ట్‌ను కూడా కనుగొన్నాము. సందేశానికి అవే పేర్లు, అదే ఫోన్ నంబర్‌లు అలాగే ఉన్నాయి.
అదే పేర్లు మరియు ఫోన్ నంబర్‌తో అక్టోబర్ 2017లో షేర్ చేసిన మరో X పోస్ట్ ఇక్కడ ఉంది.
ది హిందూ కథనం ప్రకారం, మొదటి ఫోన్ నంబర్ మీరట్‌లోని సందీప్ గార్గ్ అనే నెఫ్రాలజిస్ట్‌కు చెందినది. ఈ సందేశాలు వైరల్ అయిన తర్వాత, కిడ్నీ గురించి ఆరా తీస్తూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ అధికారులు డాక్టర్ గార్గ్‌ని సంప్రదించి వైరల్ మెసేజ్ గురించి ఆరా తీశారు. ఆ సందేశం బూటకమని తెలుసుకున్నారు. ఈ వైరల్ మెసేజీ వెనుక ఎవరు ఉన్నారని తెలుసుకోడానికి పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.
మే 2018లో ప్రచురించిన.. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ అవయవ దాన కార్యక్రమం అయిన జీవన్ దాన్ అధికారులు, కేవలం సద్భావన ఆధారంగా ఇటువంటి మార్పిడి జరగదని స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైనా అవయవ విరాళం మానవ అవయవాల మార్పిడి చట్టం (TOHA) - 1994 ప్రకారం తగిన అథారిటీ ద్వారా వెళ్లాలి. అవయవాలతో వ్యాపారాలు, పేదలను దోపిడీ చేయకుండా అరికట్టడానికి ఈ చట్టాలు, నియమాలు వచ్చాయి.
నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్
అనేది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ క్రింద ఏర్పాటు చేసిన జాతీయ-స్థాయి సంస్థ. ఇది దేశంలో అవయవాలు, కణజాలాల సేకరణ, కేటాయింపు, పంపిణీ, అవయవాలు, కణజాలాల దానం, మార్పిడికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు.
అందువల్ల, వైరల్ సందేశం 2017 నుండి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఇద్దరు వ్యక్తులకు చెందిన నాలుగు కిడ్నీలు దానం చేసేందుకు అందుబాటులో ఉన్నాయి
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News