నిజ నిర్ధారణ: మోదీ పఠాన్ సినిమా ట్రైలర్‌ను చూశారని, షారుఖ్ ఖాన్‌ను ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టారని వైరల్ అవుతున్న వీడియో మార్ఫ్ చేయబడింది.

షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం పఠాన్ అనేక కారణాల వల్ల వివాదానికి దారితీసింది. సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో #బాయ్కాట్ పఠాన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Update: 2023-01-27 08:14 GMT

షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం పఠాన్ అనేక కారణాల వల్ల వివాదానికి దారితీసింది. సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో #బాయ్కాట్ పఠాన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీపికా పదుకొణె నటించిన బేషరం రంగ్ అనే పాట ఎన్నో విమర్శలకు దారితీసింది.

ఈ చిత్రంపై వివాదాలు కొనసాగుతుండగా, భారత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ టెలివిజన్‌లో పఠాన్ సినిమా ట్రైలర్‌ను చూస్తూ, బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌ను ప్రశంసిస్తూ చప్పట్లు కొడుతున్నట్లు చూపుతున్న వీడియో ప్రచారంలో ఉంది.

ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో “” అంటూ హింది క్యాప్షంతో ప్రచారం లో ఉంది.

https://www.facebook.com/100064857960839/videos/3407158062854513

Full View


Full View

నిజ నిర్ధారణ:

వీడియోలోని పఠాన్ సినిమా ట్రైలర్‌ను భారత ప్రధాని చూస్తున్నారనే వాదన అవాస్తవం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రధాని వీక్షించే వీడియో ఇది.

వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, వీడియో మార్ఫ్ చేసినది అని తెలుస్తోంది. ఒరిజినల్ వీడియోలో చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్‌ను మోదీ వీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది.

అసలు వీడియోను ఏఎనై తన ట్విట్టర్ ఖాతాలో జూలై 2019లో షేర్ చేసింది.

2019లో ఇండియా టుడే యూట్యూబ్ ఛానెల్ ద్వారా చంద్రయాన్-2 లాంచ్ లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తున్న పిఎం మోడీ శీర్షికతో షేర్ చేసారు. 'ఇస్రో ద్వారా చంద్రయాన్-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఇస్రో మూన్ మిషన్, చంద్రయాన్-2, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించారు.'

ఇస్రో అంతరిక్ష కేంద్రంలో ఉద్రిక్త కౌంట్‌డౌన్ తర్వాత, చంద్రయాన్-2 ప్రయోగం సోమవారం జరిగింది, జూలై 15 న ప్రారంభ ప్రయత్నం సాంకేతిక లోపం కారణంగా విరమించబడిన తర్వాత, దేశవ్యాప్తంగా చాలా మంది దీనిని వీక్షించారు.

చంద్రయాన్-2 అత్యంత శక్తివంతమైన జిఎసెల్వి-ఎంకె-ఈఈఈ రాకెట్‌ను 'బాహుబలి'గా పిలిచింది. #NarendraModi #Chandrayaan2Launch #ISRO

Full View

ఇటీవల తన ప్రసంగంలో సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా పనిపై దృష్టి పెట్టాలని మోడీ తన మంత్రులను హెచ్చరించారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మనం చేస్తున్న శ్రమను కప్పిపుచ్చే విధంగా ఎవరూ అనవసర వ్యాఖ్యలు చేయొద్దు.

https://indianexpress.com/article/india/refrain-from-making-unnecessary-comments-against-films-pm-modi-to-party-workers-8388649/

డిడి నేషనల్‌లో ప్రసారమైన టీవీ సిరీస్ రామాయణం చివరి ఎపిసోడ్‌ను మోడీ చూస్తున్నారనే వాదనతో ఇదే వీడియో గతంలో వైరల్ అయింది. 2020లో అనేక నిజ నిర్ధారణ సంస్థలు ఈ క్లెయిం ను డీబంక్ చేశాయి.

https://smhoaxslayer.com/the-video-claiming-pm-modi-is-watching-ramayana-is-edited-and-fake/

కనుక, పఠాన్ సినిమా ట్రైలర్‌ను ప్రధాని మోదీ వీక్షిస్తున్న వీడియో మార్ఫ్ చేశారు అనే వాదన అబద్దం.

Claim :  Viral video shows PM Modi watching Pathan movie trailer
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News