ఫ్యాక్ట్ చెక్: ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత పాలస్తీనియన్ పిల్లలు కాలిన ఆహారం కోసం వెతుకుతున్నట్లు చూపించే వైరల్ వీడియోలో ఎటువంటి నిజం లేదు
గాజా నగరంలో రద్దీగా ఉండే అల్-అహ్లీ ఆసుపత్రిలో జరిగిన ఘోరమైన పేలుడు కారణంగా అనేక వందల మంది చనిపోయారు.
గాజా నగరంలో రద్దీగా ఉండే అల్-అహ్లీ ఆసుపత్రిలో జరిగిన ఘోరమైన పేలుడు కారణంగా అనేక వందల మంది చనిపోయారు. గాజా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ చేయలేదని చెబుతూ రాడార్ చిత్రాలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. హమాస్ తీవ్రవాదులే ఈ దాడి చేశారని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల తర్వాత పాలస్తీనాలోని ఆహారం దొరుకుతుందేమోనని పిల్లలు కాలిన ఆహారం కోసం వెతుకుతున్నట్లు ఓ వీడియో ఉంది. పిల్లలు కొన్ని ప్రాంతాలలో త్రవ్వడం, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను వెతుకుతున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది.
“Speechless: Palestinian kids searching for burnt food after Israeli airstrikes" అనే క్యాప్షన్ తో వీడియోను వైరల్ చేస్తున్నారు.
#Israel #FreeGaza #IsraelPalestineConflict #طوفان_الأقصى #طوفان_الاقصى_ #فلسطين #Gaza #Gazagenocide #IsraelTerrorists #Hamas #IsraelFightsBack #INDvsPAK #جمعة_طوفان_الأقصى #غزة_الآن #Gazagenocide #طوفان_الاقصى_ #IsraeliWarCrimes #IsraeliWarCrimes #IsraelTerrorists #PalestineLivesMatter
#PalestineLivesMatter“ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగించారు.

అదే వాదనతో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. లెబనాన్ లోని సిరియన్ రెఫ్యూజీ క్యాంపుకు సంబంధించిన వీడియో ఇది.
కీఫ్రేమ్స్ ను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఒరిజినల్ వీడియోను టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు. @moumentaleb అనే అకౌంట్ లో జులై 21, 2023న వీడియోను అప్లోడ్ చేసి ఉండడాన్ని గమనించాం.
టిక్ టాక్ వీడియోకు సంబంధించిన స్నాప్ షాట్ ఇక్కడ చూడొచ్చు.

హనిన్ అల్-మిన్యా లోని సిరియన్ క్యాంపు సంబంధించినదని అనువాదం ద్వారా తెలుసుకున్నాం.
కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా, ఉత్తర లెబనాన్‌లోని సిరియన్ శరణార్థి శిబిరంలో భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన కొన్ని కథనాలను మేము కనుగొన్నాము. తీవ్రమైన వేడిగాలుల మధ్య మంటలు శిబిరం అంతటా వ్యాపించాయి. అనేక గుడారాలు కాలిపోయాయి, కానీ ఎలాంటి ప్రాణనష్టం నివేదించలేదు. లెబనీస్ సివిల్ డిఫెన్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది.
mideastmonitor.com ప్రకారం, ఉత్తర లెబనాన్‌లోని హనీన్ పట్టణంలోని సిరియన్ల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, పెద్ద సంఖ్యలో గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనకు సంబంధించి జూలై 21, 2023 నాటి అల్జజీరా ముబాషర్ వీడియో నివేదికను కూడా మేము కనుగొన్నాము "شقانا كله راح خسرت كل شي"..Description: حريق يلتهم مخيمًا للاجئين السوريين في لبنان అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ టైటిల్ ను అనువదించగా.. "మేము నివసించే ప్రాంతం మొత్తం పోయింది, నేను ప్రతిదీ కోల్పోయాను, లెబనాన్‌లోని సిరియన్ శరణార్థి శిబిరాన్ని అగ్ని మింగేసింది" అని ఉంది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన శిబిరంలోని వ్యక్తుల ఇంటర్వ్యూలు కూడా వీడియోలో ఉన్నాయి.
Full View
వైరల్ వీడియోలో కూడా అదే భవనాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ పోలికను గమనించవచ్చు.

అందువల్ల, కాల్చిన భూభాగంలో ఆహరం కోసం పిల్లలు తిరుగుతున్న వీడియో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో చోటు చేసుకున్నది కాదు. 2023 జూలై 2023లో సిరియన్ శరణార్థుల శిబిరం అగ్నిప్రమాదంలో కాలిపోయిన వీడియో. వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు.
Claim : Viral video shows Palestinian kids searching for burnt food after Israeli airstrikes
Claimed By : Social media users
Fact Check : False