ఫ్యాక్ట్ చెక్: 188 సంల వయసున్న సాధువు గుహ నుండి బయటకు వచ్చారనేది నిజం కాదు

India is identified as a land of Yoga, where many rishis, sages, and saints can still be seen practicing age-old practices

Update: 2024-10-05 03:49 GMT

Siyaram Baba

భారతదేశానికి యోగా భూమి అని పేరు ఉంది. ఇక్కడ చాలా మంది ఋషులు, సాధువులు ఇప్పటికీ యోగా, ధ్యానం అభ్యసించడం, ఆచరించడం చూడవచ్చు. భారతదేశం ఆధ్యాత్మిక అభ్యాసాలు, సంప్రదాయాలు, యోగా, ఆయుర్వేదం వంటివి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోనే అభ్యసిస్తూ ఉన్నారు. భగవద్గీత వంటి గ్రంథాలను అనేక దేశాల్లో ప్రజలు గౌరవిస్తారు. భారతదేశం లోని పర్వతాలు, అడవులలో నివసించిన ఋషులకు సంబంధించి ఘనమైన చరిత్ర ఉంది. సాధారణ జీవితం నుండి దూరంగా జీవిస్తూ, ధ్యానం చేస్తూ ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.

ఇటీవల బలహీనంగా కనిపిస్తున్న ఓ వృద్ధుడికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. ఆయన పూర్తిగా వంగి పోయి కనిపించడమే కాకుండా, పక్కనే ఉన్న యువకుల సహాయంతో నడుస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్నది 188 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయుడని, గుహలో కనుగొన్నారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారు



Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన సియారామ్ బాబా. ఆయన వయస్సు దాదాపు 110 ఏళ్లు. ఆయన ఏ గుహలోనూ కనుగొనలేదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేయగా Ciyaram_baba00 అనే వినియోగదారు షేర్ చేసిన Instagram వీడియోని మేము కనుగొన్నాము. नर्मदा घाट निर्माण कार्य स्वयं बाबा करवाते हुए’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. నర్మదా ఘాట్‌లో నిర్మాణ పనులు బాబా స్వయంగా చూసుకున్నారని ఆ వీడియో ద్వారా తెలిపారు. #santsiyarambaba #siyarambabastatus #siyaram #reelsvideo #siyarambabakikhani #reelsinstagram #trending #omkareshwar అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగించి వీడియోను షేర్ చేశారు.
‘సంత్ సియారామ్ బాబా ఆశ్రమం మధ్యప్రదేశ్’ అనే క్యాప్షన్‌తో ఇదే వీడియోను అదే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా షేర్ చేసింది.
దాన్ని క్యూగా తీసుకుని ‘Sant Siyaram Baba Ashram Madhya Pradesh’ అనే కీవర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతికాం, మధ్యప్రదేశ్‌లోని ఒక ఆశ్రమంలో నివసించే ఈ మహర్షిపై కొన్ని కథనాలు మాకు కనిపించాయి.
నవభారత్ టైమ్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, సియారామ్ బాబా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న భట్యాన్ ఆశ్రమానికి చెందిన సాధువు. ఆయన అక్కడే నివసిస్తున్నారు. ఆయన అసలు వయస్సు ఎవరికీ తెలియదు కానీ ఆయన వయస్సు దాదాపు 109 లేదా 110 సంవత్సరాలు అని చెబుతారు. ఆయన వయస్సు విషయంలో పరిసర ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఆయన అసలు వయసు విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొంతమంది బాబా వయస్సు 130 సంవత్సరాలు అని కూడా చెబుతారు. బాబా కూడా తన వయస్సు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. విపరీతమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బాబా తనను తాను మలచుకున్నారు, ఏ వాతావరణంలోనైనా లయన్ క్లాత్ ను మాత్రమే ధరిస్తారు.
యనకు సంబంధించి ఏబీపీ లైవ్ కూడా 2023లో ఒక కథనాన్ని ప్రచురించింది. సియారామ్ బాబా రోజుకు 21 గంటల పాటు రామాయణం పారాయణం చేస్తారని తెలిపింది. ధర్మశాల, దేవాలయాల నిర్మాణానికి కోట్లాది రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చారు. ఒక భక్తుడి నుండి 10 రూపాయల కంటే ఎక్కువ తీసుకోరు. ఎవరైనా భక్తుడు ఎక్కువ ఇస్తే, ఆ మొత్తంలో నుండి కేవలం రూ.10 తీసుకుని మిగిలింది భక్తుడికి తిరిగి చెల్లిస్తారు.
అందువల్ల, వైరల్ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందిన సియారామ్ బాబాకు సంబంధించింది. ఆయన అడవిలో కాకుండా ఆశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన వయస్సు సుమారు 110 సంవత్సరాలు. వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా 188 సంవత్సరాలు కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి వయసు 188 ఏళ్లు. భారతదేశంలోని ఒక గుహలో కనిపించాడు
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News