ఫ్యాక్ట్ చెక్: వైరల్ విజువల్స్ కు వైసీపీ కి ఎలాంటి సంబంధం లేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగమైన టీడీపీ, జనసేన పార్టీలు 135 సీట్లు గెలుచుకున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
By - Satya Priya BNUpdate: 2024-09-12 06:37 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగమైన టీడీపీ, జనసేన పార్టీలు 135 సీట్లు గెలుచుకున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకుంది. వైసీపీ ప్రచారానికి భారీ మొత్తంలో జనం వచ్చారు. పార్టీ నిర్వహించిన పలు ర్యాలీలు, కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం వచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలకు పైగా కావస్తున్నా.. ఎన్నికల సమయంలో అసలు ఏం జరిగిందనే ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో తగ్గడం లేదు. ఈవీఎం ట్యాంపరింగ్, ఎన్నికల ఫలితాల విషయంలో తేడాలు జరిగాయంటూ పలువురు వైఎస్‌ఆర్‌సీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధిత ప్రాంతాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించినప్పుడు కనిపించిన జనసమూహం ఇదేనంటూ కొందరు సోషల్ మీడియా వినియోగదారులు విజువల్స్ ను షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ జనాన్ని చూపిస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికే చాలా మంది వస్తున్నారని, ఆయనకు ఎందుకు ఓటు వేయలేదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. “అసలు ఈ ఓట్లు ఎక్కడకి పోయాయి రా 11 ఎలా వచ్చాయి అసలు ఈ జనం చూసి EVM లా మీద నాకు కూడా డౌట్ వస్తుంది ..." అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించినట్లు వీడియోలో లేదు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేశాం. జూలై 2024లో అనేక సోషల్ మీడియా హ్యాండిల్‌లు ఒకే వీడియోను షేర్ చేశాయని మేము కనుగొన్నాము. టీ20 ప్రపంచ కప్ కు సంబంధించిన విజయోత్సవ పరేడ్‌లో క్రికెట్ అభిమానులు పాల్గొన్న వీడియో ఇది.
“How is the josh to see #TeamIndia Welcoming World Cup 2024 champions #VictoryParade “ అంటూ వీడియోను పలువురు యూజర్లు షేర్ చేశారు. ఇదంతా టీమిండియా టీ20 ప్రపంచ కప్ ను గెలవడం గురించి అని తెలుస్తోంది.
X లో మరొక యూజర్ ఈ విక్టరీ పరేడ్ కు చెందిన చిత్రాలను పంచుకున్నారు. ఈ చిత్రాలు వైరల్ వీడియో లో ఉన్న విజువల్స్ తో పోలి ఉండడం మనం చూడొచ్చు. గొడుగుల సముద్రం తో పాటు మానవ సముద్రం, జై హింద్, జై భారత్. మరీన్ ద్రైవ్ పైన టీం ఇండియా విక్టరీ పెరేడ్ సెలెబ్రేషన్లు అంటూ ఈ చిత్రాలను యూజర్ షేర్ చేసారు MSN.com ప్రకారం, T20 ప్రపంచ కప్ విజేత భారత జట్టు విజయోత్సవ పరేడ్ కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు.
T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత బార్బడోస్ నుండి భారత జట్టు తిరిగి వచ్చిన తర్వాత మెరైన్ డ్రైవ్ నుండి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్సులో టీమ్ ఇండియా విజయ పరేడ్ నిర్వహించింది. ముంబై నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారని కూడా
abplive నివేదించింది. ఈ సందర్భంగా కొందరు అభిమానులకు గాయాలు కూడా అయ్యాయి.
ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత జరిగిన విజయోత్సవ పరేడ్ ను వైరల్ వీడియో చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన సమయంలో వచ్చిన జనసందోహమనే వాదన అవాస్తవం.
Claim : ఏపీలో వరద బాధిత ప్రాంతాలను వైఎస్ జగన్ సందర్శించినప్పుడు కనిపించిన జనసమూహం
Claimed By : Social media users
Fact Check : False