ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ కు చెందిన మైనర్లు కాదు
మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా ఏ దేశంలోనైనా చిన్న పిల్లలకు ఊహించని ముప్పును కలిగిస్తున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి యువ తరాన్ని నియంత్రించడానికి, రక్షించడానికి
మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా ఏ దేశంలోనైనా చిన్న పిల్లలకు ఊహించని ముప్పును కలిగిస్తున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి యువ తరాన్ని నియంత్రించడానికి, రక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా మాదకద్రవ్యాలకు ఎంతో మంది బానిసలు అవుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ కు చెందినది కాదు. బీహార్‌లోని పాట్నా వీధుల్లో జరిగిన ఘటనకు సంబంధించినది.
మేము ఈ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని సెర్చ్ చేయగా.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు అదే వీడియోను “పాట్నా జంక్షన్ నషా కర్తే చోటే బచ్చే” అనే టైటిల్‌తో వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. దానిని అనువదించగా.. “పాట్నా జంక్షన్ వద్ద డ్రగ్స్ తాగుతున్న చిన్నపిల్లలు” అని అర్థం.
"పాట్నా జంక్షన్ నషా కర్తే చోటే బచ్చే" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను biharilarka ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా షేర్ చేసింది.

hindi.news18.com ప్రచురించిన కథనం ప్రకారం, బీహార్ ప్రజలు బ్లాక్‌లో మద్యం కొనుగోలు చేయడం, విక్రయిస్తూ పట్టుబడిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పాట్నా జంక్షన్ వెలుపల పిల్లలు డెండ్రైట్‌తో మత్తులో కనిపించిన వీడియో బయటపడింది.
పాట్నా జంక్షన్ బయట ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఇందులో స్టేషన్ బయట పార్కింగ్ స్థలంలో నలుగురు చిన్నారులు కనిపించారు. ఈ పిల్లలు ఓ ప్లాస్టిక్ కవర్ లో గాలిని నింపి ఊదుతూ కనిపించారు. కెమెరా చూడగానే కొందరు పిల్లలు ముఖం దాచుకున్నారు. అయితే వారిలో ఒకరు కెమెరాను చూసి అసభ్యకర సైగలు చేశాడు.
Fact check.AP.Gov.in ఈ వీడియోను డీబంక్ చేసింది. బీహార్‌లోని పాట్నాకు చెందిన కొంతమంది పిల్లల వీడియోను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వీడియోగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పాట్నా జంక్షన్ నుండి అసలు వీడియో రికార్డు చేశారని అన్నారు. నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అందుకే చిన్నపిల్లలు మత్తుమందు తాగుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్‌ది కాదు, బీహార్‌లోని పాట్నా జంక్షన్‌కి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలు తప్పుదారి పట్టించేది.
Claim : Video shows kids sniffing drugs in the streets of Andhra Pradesh
Claimed By : Twitter user
Fact Check : Misleading