ఫ్యాక్ట్ చెక్: గాజాలో శిథిలాల మధ్య తన పిల్లలకు స్నానం చేస్తున్న తల్లి వైరల్ వీడియో ఇటీవలిది కాదు

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7, 2023న మొదలైంది. 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ సైన్యం 199 మందికి పైగా అపహరించింది.

Update: 2023-10-20 06:18 GMT

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7, 2023న మొదలైంది. 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ సైన్యం 199 మందికి పైగా అపహరించింది. బంధీలుగా ఉంచుకుంది. అనేక మంది పౌరులు గాజాలో ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కొరత కూడా ప్రజల కష్టాలను రెట్టింపు చేసింది.


వైమానిక దాడి తర్వాత శిథిలాలలోని బాత్‌టబ్‌లో తన కుమారులకు స్నానం చేయిస్తున్న తల్లి వీడియో వైరల్ అవుతూ ఉంది. అక్టోబర్ 16, 2023 న గాజా లో ఈ ఘటన చోటు చేసుకుందనే వాదనతో వీడియో వైరల్ అవుతోంది.

“A scene you will only see in Gaza. Gaza life. Gaza steadfastness... - Gaza 10/16/2023 #ZionistTerror #Gazagenocide #Gaza #IsraelGazaWar #PalestineGenocide #غزة_الآن” అంటూ పోస్టులు పెట్టారు.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో ఆగస్టు 2022 నాటిది.

మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ చిత్రం ఆగస్టు 2022లో ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.

శిథిలాల మధ్యలో ఓ మహిళా తన కుమారులకు స్నానం చేయిస్తున్న వీడియో aparat.comలో ఆగష్టు 25, 2022న అప్లోడ్ చేశారు. శిథిలాల మధ్య తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయిస్తోందని వీడియోకు టైటిల్ పెట్టారు.

“Palestinian mother showering her two children on the rubble of their house demolished by airstrikes in the latest aggression on the Gaza strip.” అనే టైటిల్ తో వన్ నేషన్ అనే పేజీలో ఆగష్టు 14, 2022న వీడియో పోస్టు చేశారు. ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా వారి ఇల్లు కుప్పకూలిపోయిందని.. దీంతో ఆ తల్లి శిథిలాల మధ్యనే వారికి స్నానం చేయించిందని ఆ టైటిల్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

Full View
Spotlight Humanity అనే ఫేస్ బుక్ పేజీలో ఆగస్టు 14, 2022న వీడియోను షేర్ చేశారు.
Full View

టైమ్స్ ఆఫ్ గాజా ట్విట్టర్ హ్యాండిల్ లో ఆగష్టు 12, 2022న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. పాలస్తీనాకు చెందిన తల్లి గాజాలోని శిథిలాల మధ్య బాత్‌టబ్‌లో తన పిల్లలకు స్నానం చేయించిందని తెలిపారు.
కాబట్టి, శిథిలాల మధ్యలో ఇద్దరు పిల్లలకు స్నానం చేయిస్తున్న తల్లికి సంబంధించిన వీడియో పాతది.. ఇటీవలిది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  The viral video shows a recent scene from Gaza where a mother is bathing her kids in the rubble after an airstrike
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News