నిజ నిర్ధారణ: పర్యాటకులతో నిండి ఉన్న వ్యాన్‌పై ఏనుగు దాడిని చూపుతున్న వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు
ఒక ఏనుగు రోడ్డు పై వెల్తున్న వ్యాన్ ను ఆపి అందులో ఉన్న పర్యాటకులను భయపెట్టిన ఘటన ఆంద్రప్రదేశ్‌లోని పలమనేరు-గుడియాట్టం రహదారిపై చోటుచేసుకుందనే వాదనతో వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. పలమనేరు ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక పట్టణం, గుడియాట్టం తమిళనాడులో ఉంది.
ఒక ఏనుగు రోడ్డు పై వెల్తున్న వ్యాన్ ను ఆపి అందులో ఉన్న పర్యాటకులను భయపెట్టిన ఘటన ఆంద్రప్రదేశ్‌లోని పలమనేరు-గుడియాట్టం రహదారిపై చోటుచేసుకుందనే వాదనతో వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. పలమనేరు ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక పట్టణం, గుడియాట్టం తమిళనాడులో ఉంది.
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక-తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం-పలమనేరు బెల్ట్ లో ఏనుగులు గుంపులుగా తిరగడం సాధారణంగా కనిపిస్తుంది. అడవి ఏనుగులు తెల్లవారుజామున రోడ్డుపై నిల్చుని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలు కొన్ని మనం ఇంతకుముందు చూసాం.
అయితే, ఏనుగు వ్యాన్ లో ఉన్న ప్రయాణీకుల పై దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది, అది తెలుగులో “పలమనేరు గుడియాత్తం రోడ్డులో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఒంటరి సమయంలో ఏనుగు హల్ చల్....” అనే క్లెయిం తో షేర్ అవుతోంది.
వీడియోలో, ఏనుగు తన తొండం తో తెల్లటి వ్యాన్‌ను హింసాత్మకంగా కదిలించడం, తరువాత, తొండాన్ని ఉపయోగించి వ్యాన్ లోపలి భాగాన్ని తనిఖీ చేయడం కనిపిస్తుంది. వ్యాన్‌లో నుంచి తొండం తీసేసి ఏనుగు పక్కకు జరిగీన తరువాత, ప్రయాణీకులు వ్యాన్‌లోకి ఎక్కుతారు.
నిజ నిర్ధారణ:
క్లెయిం అవాస్తవం. వీడియోలో కనిపిస్తున్న ఘటన పలమనేరు- గుడియాట్టం రోడ్డులో జరిగింది కాదు.
వీడియో నుండి సంగ్రహించబడిన కీలక ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, మేము మెరుగైన రిజల్యూషన్‌తో వీడియోను షేర్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌ని కనుగొన్నాము. లంకాశ్రీ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోను జనవరి 4, 2023న తమిళ్ టైటిల్‌తో ప్రచురించింది ““யானைக்கு உணவு வழங்கியவர்களுக்கு நேர்த கதி! நெஞ்சை பதபதைக்கும் காட்சிகள்!” అనువదించగా, "ఏనుగు కు ఆహరం పెడితే అంతే, గుండె బరువెక్కె దృశ్యాలు"
ఘటన ఎక్కడ జరిగిందో వీడియోలో చెప్పనప్పటికీ, ఛానెల్ వివరణ అది శ్రీలంకకు చెందినదని, శ్రీలంక నుండి వచ్చిన వార్తలను తమిళంలో కవర్ చేస్తుందని సూచిస్తుంది. వీడియోలో, వ్యాన్‌పై ‘హాలిడే శ్రీలంక’ లోగోను మనం స్పష్టంగా చూడవచ్చు.
న్యూస్‌వైర్‌ఎల్‌కె చేసిన ఒక ట్వీట్ లభించింది, అందులో "ఎస్‌ఎల్ రోడ్‌లో ఏనుగు దాడి చేసిన వ్యాన్‌కి సమీపంలో ఎస్కేప్ అవ్వడం చూడండి: https://bit.ly/3CJf2Uf Primitive Wildlife SL " అనే శీర్షికతో వీడియోను షేర్ చేసింది. ణెవ్స్విరెళ్ఖ్ శ్రీలంకకు చెందిన న్యూస్ పబ్లిషర్ ణెవ్స్విరె.ల్క్ ట్విట్టర్ హ్యాండిల్. న్యూస్‌వైర్‌ఎల్‌కె ద్వారా ప్రిమిటివ్ వైల్డ్ లైఫ్ యూట్యూబ్ ఛానెల్‌కు వీడియో క్రెడిట్ ఇవ్వబడింది.
ప్రిమిటివ్ వైల్డ్ లైఫ్ యూట్యూబ్ చానల్ వీడియో.
న్యూస్ ఫ్లేర్.కాం లోని ఒక నివేదిక ప్రకారం, ఈ సంఘటన జనవరి 1, 2023న శ్రీలంకలోని మొనరాగలలోని అలా నేషనల్ పార్క్‌లో జరిగింది.
కనుక, వ్యాన్‌లో ప్రయాణీకులపై ఏనుగు దాడి చేసిన వీడియో శ్రీలంకకు చెందినది కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినది కాదు. వాదన అవాస్తవం.