నిజ నిర్ధారణ: వీధిలో దండుగా కాకులు కూర్చున్న వీడియో జపాన్ లోని క్యోటో లో తీసినది కాదు, మెక్సికో లోనిది
రెసిడెన్షియల్ ఏరియాలోని ఒక వీధిలో వందలాది కాకులు ఇళ్లపై కూర్చుని ఉండడం చూపించే వీడియో జపాన్‌లోని క్యోటో నగరంలోనిది అనే క్లెయిం తో వైరల్ అవుతోంది.
రెసిడెన్షియల్ ఏరియాలోని ఒక వీధిలో వందలాది కాకులు ఇళ్లపై కూర్చుని ఉండడం చూపించే వీడియో జపాన్‌లోని క్యోటో నగరంలోనిది అనే క్లెయిం తో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలోనే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా విస్తృతంగా షేర్ అవుతోంది.
ఆ వీడియోలో వందలాది కాకులు కార్లపైన, పరిసరాలలో ఉన్న ఇళ్లపైన కూర్చోవడం, ఎగరడం చూడవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను పక్షులు పసిగట్టగలవు అనే క్యాప్షన్‌లతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ను మూలంగా చేసుకొని టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఒక కధనం కూడా ప్రచురించారు. ఈ కథనంలో వీడియో నుండి సంగ్రహించిన స్క్రీన్‌షాట్‌లు కూడా షేర్ చేసారు. జపాన్‌లోని క్యోటో సమీపంలోని ఓ దీవి చుట్టూ కాకులు తిరుగుతున్నాయని ఆ కథనం పేర్కొంది.
https://www.tamilspark.com/
https://indiajustnow.in/
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు “కాకులు, క్యోటో, జపాన్” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
ఆ వీడియో జపాన్‌లోని క్యోటోలో తీసినది అనే క్లెయిం అవాస్తవం. వీడియో మెక్సికో లో తీసినది.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, జనవరి 2023లో వీడియో నుండి తీసుకున్న కొన్ని చిత్రాలను షేర్ చేసిన మెక్సికన్ ప్రచురణలు లభించాయి.
ప్రచురణల ప్రకారం, వీడియోను మొదట టిక్టాక్ వినియోగదారుడు @josueresndiz షేర్ చేశారు.
కనాల్44.కాం ప్రకారం, వీడియో ఎక్కడ రికార్డ్ అయ్యిందో వినియోగదారుడు పేర్కొనలేదు, కానీ వీడియోలో కనిపించే వాహనంపై ఉన్న లైసెన్స్ ప్లేట్ ప్రకారం ఇది మెక్సికో లోని గ్వానాజువాటో లోనిది అయి ఉంటుందని ఇంటర్నెట్ వినియోగదారులు భావించారు.
ఈ నివేదికల ద్వారా షేర్ అయిన చిత్రాలను వైరల్ వీడియో విజువల్స్‌తో పోల్చినప్పుడు, రెండూ ఒకే విజువల్స్‌ను చూపుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
పోలిక ఇక్కడ ఉంది.
వైరల్ వీడియో ని జనవరి 30, 2023న ఎమెసెన్.కాం లో షేర్ చేసారు, ఇక్కడ లైసెన్స్ ప్లేట్ ను స్పష్టంగా చూడవచ్చు, ఖచ్చితంగా దానిపై గ్వానాజువాటో అని రాసి ఉండడం చూడవచ్చు.
వీడియో నుండి సంగ్రహించబడిన లైసెన్స్ ప్లేట్ చిత్రం ఇక్కడ చూడవచ్చు.
కనుక, నివాస ప్రాంతంలోని వీధిని ఆక్రమించిన వందల కొద్దీ కాకుల వైరల్ వీడియో మెక్సికోలో తీసినది, జపాన్‌లోని క్యోటోలో కాదు. క్లెయిం అవాస్తవం.