ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ స్టేజీ మీద నృత్యం చేయలేదు..ఆయనలా ఉన్న వికాస్ మహంతేకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

వికాస్ మహంతేకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

Update: 2023-11-17 03:22 GMT

నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌తో పాటు పలు ప్రాంతాల్లో గర్భా డ్యాన్స్ ఈవెంట్లను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉంటారు. గర్బా నృత్య వేడుకల్లో చిన్నా పెద్దా, యువతీ యువకులు పాల్గొంటారు. నవరాత్రి పండుగ సందర్భంగా ప్రదర్శించబడే సాంప్రదాయ గుజరాతీ జానపద నృత్యం.

అక్టోబర్ 15న, నరేంద్ర మోదీ తన X ఖాతాలో "మాది" అనే గర్బా పాటకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను షేర్ చేశారు. నవరాత్రుల సమయం కావడంతో పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుగుకోవాలని కోరారు.
అయితే గర్బా పాటకు ప్రధాని మోదీ డ్యాన్స్ చేస్తున్నారు అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కొందరు మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండడం మనం చూడొచ్చు.
School of Vedic Science అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. “Wah Modi ji Wah.” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.


Dr. Nandinibjp అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బాగా డ్యాన్స్ చేసారంటూ ఆ పోస్టుల ద్వారా తెలిపారు.


NOISE అనే ఎక్స్ యూజర్ 30-సెకండ్ల వీడియోను పోస్టు చేసింది. అందులో ఉన్నది మోదీనా.. లేక ఆయన డీప్ ఫేక్ వీడియోనా అంటూ కూడా ప్రశ్నించారు. “Is that PM Modi dancing Garba? Or is it his Look-alike or deep fake? Nice moves, Mr.2024 with an emoji” అంటూ పోస్టు పెట్టారు.

FREE BIRD అనే ఫేస్ బుక్ అకౌంట్ లో ప్రధాని మోదీ బాగా డ్యాన్స్ చేస్తున్నారంటూ పోస్టు పెట్టారు.



 


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
గర్బా ఈవెంట్‌లో ప్రధాని మోదీ డ్యాన్స్ చేయడం గురించి మాకు ఎలాంటి వార్తలు కనిపించలేదు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మోదీ కాదని, ఆయనలాగా కనిపించే వ్యక్తి అని వైరల్ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి.

Prof. అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోపై స్పందించారు. "అతను వికాస్ మహంతే అని.. వ్యాపారవేత్త అని.. ఇప్పుడు నటిస్తూ ఉన్నారని..ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా కనిపిస్తారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్‌షాట్‌లను జోడించారు.

మహంతే ఇన్‌స్టాగ్రామ్ అధికారిక పేజీలో, నవంబర్ 7, 2023న షేర్ చేసిన ఒక వీడియోను మేము కనుగొన్నాము. ఆ వీడియోలో.. లండన్‌లో జరిగిన “దీపావళి మేళా”కి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు.


 



గర్బా ఈవెంట్‌లో, మహంతే ప్రధాని మోదీ లాగా కనిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాగా దుస్తులు ధరించాడు.



 

వికాస్ మహంతేని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన లండన్ దీపావళి మేళా ఈవెంట్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. ఈ పోస్ట్‌లో, "దీపావళి షాపింగ్ బజార్ 2023"లో ప్రధాని మోదీ, సల్మాన్ ఖాన్ డూప్ పాల్గొంటారని పేర్కొన్నారు.
Full View


వైరల్ వీడియోలో ఉన్నది ప్రధాని మోదీ కాదని.. ఆయన లాగే ఉండే నటుడు వికాస్ మహంతే అని మేము కనుగొన్నాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.


Claim :  Viral video of Modi dancing at a Garba event shows his look-alike Vikas Mahante
Claimed By :  Social Media
Fact Check :  False
Tags:    

Similar News