నిజ నిర్ధారణ: వైరల్ వీడియో దెబ్బతిన్న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ని చూపట్లేదు, వర్షాలకు దెబ్బతిన్న భోపాల్ సమీపంలోని కలియాసోట్ వంతెనను చూపిస్తుంది

ఇటీవల భారత ప్రధానమంత్రి ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ను చూపుతున్నట్లు ఒక దెబ్బతిన్న వంతెన వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపిస్తున్న వంతెన భారీ వర్షాలకు ఒకవైపుకు కుంగిపోయింది.

Update: 2022-07-28 02:23 GMT

ఇటీవల భారత ప్రధానమంత్రి ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ను చూపుతున్నట్లు ఒక దెబ్బతిన్న వంతెన వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపిస్తున్న వంతెన భారీ వర్షాలకు ఒకవైపుకు కుంగిపోయింది.

ఈ వీడియో హిందీలో క్యాప్షన్‌తో ఫేస్‌బుక్‌లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఆ క్యాప్షన్ ""पहली बरसात में ही बुंदेलखंड एक्सप्रेस-वे के हालात..लगता है ड्रोन की बैटरी ख़राब है...फलाने फलाने है तो सब मुमकिन है #Vip बाले अब लगाओ स्टेटस पर #बघेल____________साहब".

తర్జుమా చేయగా ""మొదటి వర్షంలోనే బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే పరిస్థితి..డ్రోన్ బ్యాటరీ చెడిపోయినట్లుంది...అలా చేయాలనుకుంటే అన్నీ సాధ్యమే"

Full View


Full View

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేని చూపుతోందనే వాదన అబద్దం. ఇది మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలోని కలియాసోట్ నదిపై ఉన్న వంతెన.

వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, భోపాల్ సమీపంలోని కలియాసోట్ నదిపై కలియాసోట్ వంతెనను వీడియో చూపినట్లుగా తెలుస్తోంది.

Full View

టైమ్స్ ఆఫ్ఇండియాలో ప్రచురితమైన కథనం ప్రకారం, భోపాల్‌ని జబల్‌పూర్‌ తో కలిపే ణ్-12లో మండిదీప్‌కు సమీపంలో కొత్తగా నిర్మించిన వంతెనపై ఉన్న 40 మీటర్ల పొడవు రిటైనింగ్ వాల్, రహదారిలో కొంత భాగం కిందికి కూరుకుపోయింది. కేవలం ఒక సంవత్సరం క్రితం నిర్మించబడిన ఈ బ్రిడ్జి, ఈ సీజన్‌లో కలియాసోట్ డ్యామ్ నుండి వచ్చే నీటి ధాటి ని తట్టుకోలేకపోయింది.

ఇదే విషయాన్ని వివరించే మరో కథనం ఇక్కడ చూడొచ్చు.

https://www.timesnownews.com/india/bhopal-part-of-bridge-collapses-due-to-heavy-rain-15-villages-facing-deluge-after-water-released-from-dams-article-93105471

ఇటీవల నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే కూడా వర్షాల కారణంగా దెబ్బతిన్నది. నష్టం యొక్క దృశ్యాలను చూపించే నివేదికలు ఇక్కడ ఉన్నాయి.

https://www.hindustantimes.com/videos/news/pm-inaugurated-bundelkhand-expressway-damaged-in-rains-opposition-mocks-bjp-101658482328870.html

https://www.telegraphindia.com/india/four-lane-bundelkhand-expressway-develops-wide-cracks/cid/1876334

అందువల్ల, వైరల్ వీడియో ఇటీవల ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకి జరిగిన నష్టాన్ని చూపడంలేదు. ఈ వీడియో భోపాల్ సమీపంలోని కలియాసోట్ వంతెనను చూపుతోంది. దావా అబద్దం.

Claim :  Viral video show damaged Bundelkhand expressway
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News