ఫ్యాక్ట్ చెక్: యాపిల్ పండ్లకు రంగులు వేస్తున్న వీడియో భారత్ కు చెందినది కాదు

పండ్లను తింటే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి చేరుతాయి. విటమిన్ సి, విటమిన్ ఎ లోపాలను నివారించడంలో పండ్లు గొప్ప పాత్ర

Update: 2024-10-15 07:47 GMT

candy apples

పండ్లను తింటే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి చేరుతాయి. విటమిన్ సి, విటమిన్ ఎ లోపాలను నివారించడంలో పండ్లు గొప్ప పాత్రను పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలను చేర్చుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుండి దూరమవ్వొచ్చు. పండ్లు ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగం. పొటాషియం, ఫోలేట్ (ఫోలిక్ యాసిడ్), పాలీఫెనాల్స్‌తో సహా పలు యాంటీఆక్సిడెంట్‌లతో సహా అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. యాపిల్స్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న పండ్ల లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, వివిధ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాపిల్స్ ను తింటే అతి తక్కువ కేలరీలు శరీరంలోకి చేరుతాయి.

యాపిల్స్ తొక్కలపై క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున చాలా మంది ఆపిల్స్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దీన్ని నివారించడానికి తినడానికి ముందు ఆపిల్‌ను బాగా కడగడం మంచిది, కొందరైతే ఏకంగా తొక్కను కూడా తీసేస్తూ ఉంటారు. అయితే ఆపిల్‌లను తొక్క లేకుండా తినడం వల్ల పోషక విలువలు తగ్గుతాయి. 
మనం మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న యాపిల్స్‌కు కృత్రిమ రంగులు వేస్తున్నారంటూ ఓ వ్యక్తి యాపిల్‌కు ఎరుపు రంగు పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మీరు తింటున్న యాపిల్ కి రంగు ఇలా వస్తుంది.. మార్కెట్లో ఆపిల్ కలర్ చీటింగ్..” అంటూ పోస్టులు పెడుతున్నారు.
Full View

Full View

Full View
జూన్ 2024లో కూడా ఈ వాదన వైరల్ అయింది. ఈ వీడియోను “Get ready to have Apples with beautiful harmful color coating and help the Doctors/hospitals through Medical bills.” అనే క్యాప్షన్ తో పోస్టులు పెడుతున్నారు. అందంగా కనిపించే యాపిల్స్‌ కు హాని కలిగించే రంగులు పూస్తూ ఉంటారు. ఇలాంటివి తిని బిల్లుల ద్వారా వైద్యులు/ఆసుపత్రులకు సహాయం చేస్తారంటూ పోస్టులు పెడుతున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియోను గమనిస్తే, ఆ ఆపిల్‌ పైన కాడ లేదని మనం గమనించవచ్చు. మార్కెట్‌లో లభించే యాపిల్స్‌పై ఎప్పుడూ కాడలు ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు.

బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే బస్తాలపై చైనీస్ అక్షరాలు ఉన్నాయని, ఇంగ్లీష్ లేదా మరే ఇతర భారతీయ భాష కానీ లేదని మేము గుర్తించాము. దీంతో ఆ వీడియో భారత్‌కు చెందినది కాదని తేలింది.


వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. కొన్ని వార్తా వెబ్‌సైట్‌లు ఆ వీడియో భారతదేశానికి చెందినది కాదని పేర్కొంటూ పలు కథనాలను ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.

బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన కథనం
ప్రకారం, మేకప్ వేసుకున్న స్త్రీలను మనం చూశాం. కానీ ఈ వీడియోలో "యాపిల్" మేకప్ జరుగుతోందన్నారు. ఒక దుకాణదారుడు యాపిల్స్‌కు కృత్రిమ ఎరుపు రంగుతో రంగులు వేస్తూ కనిపించాడు. ప్రజలు తరచుగా ఎరుపు ఆపిల్‌లను ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ ఎరుపు రంగు యాపిల్స్ అసలు నిజం ఇదే, ఆపిల్‌లకు ఇలా రంగులు వేయడం ద్వారా, ఆపిల్‌లు తాజాగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ వీడియో భారతదేశానికి చెందినది కాదు, ఎందుకంటే ఈ వీడియోలోని బస్తాలపై చైనీస్ భాష ఉందని తెలిపారు.

TV9 Bharatvarsh కూడా ఇందుకు సంబంధించిన వెబ్ స్టోరీని ప్రచురించింది, వీడియోను గమనిస్తే, వీడియో భారతదేశానికి చెందినది కాదని, వీడియోలోని బస్తాలపై చైనీస్ భాష కనిపిస్తుందని కూడా పేర్కొంది. యాపిల్‌లకు పెయింటింగ్ చేయడంలో సారూప్య పద్ధతులను చూపించే కొన్ని ఇతర వీడియోలు ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలలో కూడా, యాపిల్స్‌కు కాడలు లేవని మనం గమనించవచ్చు.

Full View
Full View
చైనా వంటి విదేశాల్లో కనిపించే కృత్రిమ యాపిల్స్‌కు రంగులు వేసే ప్రక్రియను భారతదేశంలో జరిగిందనిగా ప్రచారం చేస్తున్నారు. ఆపిల్‌లకు హానికరమైన రంగులు వేస్తున్నారని వాటిని ఆకర్షణీయంగానే కాకుండా, వాటిని తింటే ఎంతో ప్రమాదమని తప్పుడు వాదనలతో పంచుకుంటున్నారు. ఆ వీడియోకు భారత్‌తో ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  భారతదేశంలో యాపిల్స్‌ ను ఆకర్షణీయంగా మార్చడానికి హానికరమైన రంగులు పూస్తున్నారు
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News