ఫ్యాక్ట్ చెక్: WPLలో RCB విజయం సాధించిన తర్వాత అభిమానులు టపాసులు కాల్చడాన్ని చూపించే వైరల్ వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. RCB ఫ్రాంచైజీ పెట్టినప్పటి నుండి గెలుచుకున్న మొదటి టైటిల్ ఇది.
న్యూఢిల్లీలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. RCB ఫ్రాంచైజీ పెట్టినప్పటి నుండి గెలుచుకున్న మొదటి టైటిల్ ఇది.
ఈ విజయం తర్వాత, “RCB విన్ సెలబ్రేషన్ బిగిన్స్” అనే క్యాప్షన్‌తో భారీగా బాణసంచా పిలుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. వీధిలో బాణసంచా పేల్చడంతో భారీగా పొగలు వెదజల్లుతున్నట్లు వీడియోలో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
డబ్ల్యుపిఎల్ విజయం తర్వాత ఆర్సీబీ అభిమానుల సంబరాలకు సంబంధించిన వీడియో అంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో పాతది.. భారతదేశానికి సంబంధించినది కాదు.మేము వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను తీసుకుని.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. ఈ వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో 2014 నుండి ఉన్నట్లు మేము కనుగొన్నాము. వీడియో పొడవైన వెర్షన్ ఫిబ్రవరి 19, 2014లో నెల్సన్ ఫంగ్ అనే ఛానెల్ ద్వారా YouTubeలో అప్లోడ్ చేశారు. “Most powerful way to set off firecrackers” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోను అనేక ఇతర యూట్యూబ్ ఛానెల్స్ కూడా షేర్ చేశాయి.
డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. వీడియో నుండి తీసుకున్న స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశారు. చైనాకు చెందిన ఓ బృందం ఒకేసారి మిలియన్ల కొద్దీ బాణసంచాను కాల్చారు. ఈ నివేదిక డిసెంబర్ 31, 2014న ప్రచురించారు.
చైనా వాళ్లు అప్పుడు ఎందుకు కాల్చారో మాకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే 2014 నుండి ఈ వీడియో ఇంటర్నెట్ లో ఉందని మాత్రం మేము గుర్తించాం. అంతేకాకుండా మహిళల ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి.. ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు.
Claim : A viral video shows fans celebrating the victory of Royal Challengers B in the Women’s Premier League.
Claimed By : Instagram User
Fact Check : False