ఫ్యాక్ట్ చెక్: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటింటికి పంచుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన వేడుకకు సంబంధించిన క్రతువులు జనవరి 16, 2024న ప్రారంభమవుతాయి. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత మహోత్సవాన్ని నిర్వహించనున్నారు

Update: 2024-01-15 11:13 GMT

Modi in Ayodhya

అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన వేడుకకు సంబంధించిన క్రతువులు జనవరి 16, 2024న ప్రారంభమవుతాయి. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగమవ్వనున్నారు.

ఈ వేడుక కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా దాదాపు 6,000 ఆహ్వాన కార్డులు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వీధుల్లో నడుస్తున్న వీడియో, రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటికీ వెళుతున్నారనే వాదనతో షేర్ చేస్తున్నారు.

“*సత్యమేవ జయతే అయోధ్యలో చిన్న చిన్న సందుల్లో సైతం రామాలయం పునహః ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఇంటింటికి పంచుతున్న మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్” అంటూ పోస్టులు పెడుతున్నారు.
Full View

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
అయోధ్యలోని ఉజ్వల పథకం లబ్ధిదారుల్లో ఒకరి ఇంటికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినట్లు ఆ వీడియో చూపిస్తుంది.
ప్రధాని మోదీ అయోధ్యలోని ప్రజలను పవిత్రోత్సవానికి ఆహ్వానించారనే విషయాన్ని తెలుసుకోడానికి సంబంధించిన నివేదికల కోసం వెతకగా.. మాకు ఎలాంటి వార్తా మాకు దొరకలేదు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా పవిత్రోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ట్రస్టుకు, భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. జనవరి 1, 2024న సుమన్‌టీవీ న్యూస్ ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. “PM Modi at 10th crore Ujjwala Yojana Beneficiary’s home In Ayodhya I Latest Telugu News” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. అయోధ్యలో ఉజ్వల యోజన లబ్ధిదారుల ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారని ఈ వీడియో టైటిల్ ద్వారా తెలుస్తోంది.
Full View

అయోధ్యలోని ఉజ్వల లబ్ధిదారుల ఇంటికి ప్రధానమంత్రి సందర్శనకు సంబంధించిన పలు విజువల్స్ ఇక్కడ ఉన్నాయి.
Full View

cnbctv18.com ప్రకారం.. అయోధ్య విమానాశ్రయం, పునర్నిర్మించిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఆలయ పట్టణం అయోధ్యకు వచ్చారు ప్రధాని మోదీ. ఉజ్వల పథకంలో 10వ కోట్ల మంది లబ్ధిదారురాలైన మహిళ ఇంటి వద్ద ఆగారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు LPG కనెక్షన్‌లను అందించే పథకం మే 2016లో ప్రారంభించారు.
నివేదికల ప్రకారం,
జనవరి 22, 2024న అయోధ్యకు సాధారణ ప్రజలు రావద్దని భారత ప్రధాని ప్రజలను కోరారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీరాముని భక్తులు వారి సౌలభ్యం మేరకు అయోధ్యను సందర్శించాలని ఆయన అభ్యర్థించారు.
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటింటికి పంచుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  A viral video shows Indian Prime Minister Narendra Modi inviting people for the consecration ceremony of Ram Mandir by going to door to door
Claimed By :  Facebook Users
Fact Check :  Misleading
Tags:    

Similar News